ఇందులో వండితే నూనె అవసరం లేదు!

వేడివేడి చికెన్‌.. అంటే నోరూరుతుంది కదా! కానీ దానిలో వేసే నూనెలు, మసాలాలు పేరుచెబితే మాత్రం కెలొరీలు భయంతో కాస్త ఆలోచిస్తాం. అదే మీ దగ్గర ఈ చికెన్‌ బ్రిక్స్‌ ఉంటే అలా ఆలోచించాల్సిన అవసరమే ఉండదు.

Updated : 05 Mar 2023 11:31 IST

వేడివేడి చికెన్‌.. అంటే నోరూరుతుంది కదా! కానీ దానిలో వేసే నూనెలు, మసాలాలు పేరుచెబితే మాత్రం కెలొరీలు భయంతో కాస్త ఆలోచిస్తాం. అదే మీ దగ్గర ఈ చికెన్‌ బ్రిక్స్‌ ఉంటే అలా ఆలోచించాల్సిన అవసరమే ఉండదు. కారణం ఇది టెర్రాకోట మట్టితో చేసిన కుండ. చక్కగా ఓ పూర్తి కోడిని బేక్‌ చేయడానికి వీలుగా ఈ చికెన్‌ బ్రిక్స్‌ని రూపొందించారు. వండాల్సిన పదార్థాలని ఉంచి మూత పెట్టేస్తే చాలు. నూనె అవసరం ఉండదు. కుక్కర్‌లో మాదిరిగానే దానిలోంచి వచ్చే ఆవిరిని పట్టి ఉంచి చికెన్‌ని మెత్తగా ఉడికేట్టు చేస్తుంది. దానిలో సహజంగా ఉండే కొవ్వే సరిపోతుంది కాబట్టి నూనె అవసరం లేదు. మట్టి దాకల్లో వండితే వచ్చే రుచితోపాటు కెలొరీలు తక్కువగా ఉండేట్టు చేయడం ఈ చికెన్‌ బ్రిక్స్‌ ప్రత్యేకం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని