అదిరే అంబుర్‌ బిర్యానీ

బిర్యానీల్లో మరింత ప్రత్యేకమైంది అంబుర్‌ బిర్యానీ. దీన్ని హోటల్‌ స్టైల్లో మీ ఇంట్లోనే చేసి చూడండి..

Published : 23 Jun 2024 00:51 IST

బిర్యానీల్లో మరింత ప్రత్యేకమైంది అంబుర్‌ బిర్యానీ. దీన్ని హోటల్‌ స్టైల్లో మీ ఇంట్లోనే చేసి చూడండి..

కావలసినవి

బియ్యం (చిట్టి ముత్యాలు), మటన్‌ - అర కిలో చొప్పున, నూనె, కొత్తిమీర తరుగు, పుదీనా, పెరుగు - అర కప్పు చొప్పున, అల్లం వెల్లుల్లి ముద్ద - 50 గ్రా, ఉల్లి తరుగు - కప్పు, టొమాటో ముక్కలు - ముప్పావు కప్పు, పచ్చిమిర్చి ముద్ద - టేబుల్‌ స్పూన్, లవంగాలు, యాలకులు - 5 చొప్పున, దాల్చిన చెక్క - అరంగుళం ముక్క, నిమ్మరసం - చెంచా, ఉప్పు - రుచికి తగినంత, కారం, గరంమసాలా - చెంచా చొప్పున, ధనియాల పొడి - 2 చెంచాలు

తయారీ

ముందుగా బియ్యం కడిగి, నానబెట్టాలి. మటన్‌ను శుభ్రం చేసి ముక్కలు కోయాలి. కుక్కర్‌లో నూనె వేడయ్యాక దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలను వేగనివ్వాలి. అందులో ఉల్లితరుగు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించి.. అల్లం వెల్లుల్లి పేస్ట్‌ వేయాలి. అది పచ్చి వాసన పోయాక.. టొమాటో ముక్కలు జోడించి, ఉడికించాలి. అందులో మిర్చిముద్ద, మటన్‌ ముక్కలు వేసి వేయించాలి. ఐదు నిమిషాల తర్వాత రెండు కప్పుల నీళ్లు, గరంమసాలా, ధనియాల పొడి, కారం, కొత్తిమీర, పుదీనా, పెరుగు, ఉప్పు, నిమ్మరసం అన్నీ వేసి.. మీడియం సెగ మీద 4 విజిల్స్‌ వచ్చే వరకు ఉడికించాలి. ఆవిరి పోయేవరకు ఆగి, నానబెట్టిన బియ్యాన్ని మటన్‌ మిశ్రమంలో వేసి.. తగినన్ని నీరు పోసి ఒక విజిల్‌ వచ్చాక దించేస్తే.. రుచికరమైన ‘అంబుర్‌ మటన్‌ బిర్యానీ’ సిద్ధం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని