కట్టిపరిగల ఇగురు

పొలుసూ, చేదుగట్టు అన్నీ తీసి చేపల్ని శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి. చిన్నవయితే ముక్కలు చేయకుండా అలానే వండుకోవచ్చు. పెద్దవయితే రెండు ముక్కలు...

Published : 25 Nov 2017 18:57 IST

మా వూరి వంట 
కట్టిపరిగల ఇగురు

కావాల్సినవి: 
కట్టిపరిగ చేపలు- నాలుగు(పెద్దవి), ఉల్లిపాయలు- రెండు, పచ్చిమిర్చి- నాలుగు(నిలువుగా చీల్చినవి), ఉప్పు- తగినంత, కారం- చెంచా, ధనియాలు- చెంచా, జీలక‌్రం½- అరచెంచా, వెల్లుల్లి- పదిరేకలు, అల్లం- చిన్నముక్క, కొత్తిమీర- కొద్దిగా, కరివేపాకు- రెండు రెబ్బలు, నూనె- తగినంత

తయారీ: 
పొలుసూ, చేదుగట్టు అన్నీ తీసి చేపల్ని శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి. చిన్నవయితే ముక్కలు చేయకుండా అలానే వండుకోవచ్చు. పెద్దవయితే రెండు ముక్కలు చేసుకోవాలి. ఉల్లిపాయలు, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, అల్లం అన్నింటినీ మిక్సీలో వేసి ముద్ద చేసుకోవాలి. ఇప్పుడు మూకుడులో నూనె పోసి వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముద్ద వేసి పచ్చివాసన పోయేంతవరకూ దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు చేప ముక్కల్ని వేసుకుని కాసేపటికి ఉప్పు, కారం, పసుపు, కరివేపాకు వేసుకుని గరిటెతో చేపలు చెదిరిపోకుండా కొద్దిగా అటూఇటూ తిప్పుకోవాలి. ఎక్కువ సమయం తీసుకోకుండా ఉడికిపోతాయి. ఘుమఘుమలాడే వాసన వచ్చేసరికి కొత్తిమీర వేసుకుని దింపుకోవడమే. ఇందులో మసాలాలు వాడలేదని మీరనుకోవచ్చు. అవేమి అవసరం లేకుండా కూడా ఈ కూర రుచిగా ఉంటుంది.

సత్యామణి అడ్డగళ్ల, పి గన్నవరం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని