మడకర్రలపై వండే... చప్పిడి చేపలు..

చప్పిడి చేపలు అంటే చప్పగా ఉంటాయేమో అనుకునేరు. అదేం లేదు. అదిరిపోయే...

Published : 24 Dec 2017 02:00 IST

ప‌క్కా లోక‌ల్‌ !
మడకర్రలపై వండే... చప్పిడి చేపలు..

ప్పిడి చేపలు అంటే చప్పగా ఉంటాయేమో అనుకునేరు. అదేం లేదు. అదిరిపోయే రుచి వీటి సొంతం. మామూలుగా అయితే పచ్చి చేపని తెచ్చుకున్న వెంటనే వండుకోవాల్సిందే. లేదంటే నిల్వ చేయడం కోసం ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవాలంటే ఎండు చేపలు కొనుక్కోవాలి. కానీ ఈ చప్పిడి చేపలు ఫ్రిజ్‌లో పెట్టకపోయినా కూడా వారం రోజుల వరకూ ఏం కావు. అదే వీటి ప్రత్యేకత.

తూర్పుగోదావరి జిల్లా మడ అడవుల్లో దొరికే మడ కర్రల పైనా, చెరకు పిప్పిపైనా గడ్డిని ఉంచి వీటిని ప్రత్యేకంగా కాలుస్తారు. తేమ పోయి వీటికి ఒక రకమైన ప్రత్యేకమైన రుచి వస్తుంది. ఓ మోస్తరు పరిమాణంలో ఉండే కట్టిపరిగ, ఇసుకదొందులు, కొయ్యింగ చేపల్ని ఈ పద్ధతిలో కాలుస్తుంటారు. వీటిని వండుకోవడం కూడా సులభం. పైన పొట్టు తేలిగ్గా వచ్చేస్తుంది. వీటిని ముక్కలుగా కోసుకుని మునక్కాడ, కోడిగుడ్డు, చిక్కుడుకాయ కాంబినేషన్‌తో వండుకుంటే ఆ రుచే వేరని అంటారు స్థానికులు. విడిగా కూడా వండుకోవచ్చు. ఇగురు కూరలు బాగుంటాయి. అయితే  వీటిని కాల్చడం ప్రత్యేకమైన కళ. పండి, పల్లం, పి.గన్నవరం వంటి ప్రాంతాల్లో కాల్చిన చేపలకి గిరాకీ ఎక్కువగా ఉంటుంది. వీటినే ఆర్చిన చేపలనీ, పొగబెట్టిన చేపలనీ కూడా అంటారు. ముల్లు తీసేసి పిట్టులా కూడా వండుకోవచ్చు.

- భగత్‌సింగ్‌, న్యూస్‌టుడే, పి.గన్నవరం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని