ఆయ్.. మా కుండ బిర్యానీ రుసి సూత్తారాండీ!
కుండబిర్యానీలు చాలా చోట్ల దొరుకుతున్నా... రావులపాలెం కుండబిర్యానీ రుచి ప్రత్యేకం. ప్రత్యేకమైన మసాలాలతో కుండల్లో వండే ఈ బిర్యానీ తెలుగు ప్రాంతాలతో పాటు తమిళనాడు, కర్నాటక ప్రాంతాలకు వేడివేడి పార్శిల్‌గా చేరిపోతుందంటే నమ్ముతారా?...
పక్కాలోకల్
ఆయ్.. మా కుండ బిర్యానీ రుసి సూత్తారాండీ!
కుండబిర్యానీలు చాలా చోట్ల దొరుకుతున్నా... రావులపాలెం కుండబిర్యానీ రుచి ప్రత్యేకం. ప్రత్యేకమైన మసాలాలతో కుండల్లో వండే ఈ బిర్యానీ తెలుగు ప్రాంతాలతో పాటు తమిళనాడు, కర్నాటక ప్రాంతాలకు వేడివేడి పార్శిల్‌గా చేరిపోతుందంటే నమ్ముతారా?...ఘుమఘుమలాడే బాస్మతీ రైస్, ఘాటెక్కించే మసాలాదినుసుల పేరుచెప్పగానే హైదరాబాద్ బిర్యానీనే చటుక్కున గుర్తొకొస్తుంది. కానీ హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలో కూడా రావులపాలెం కుండ బిర్యానీకి ఫ్యాన్స్ ఉన్నారని అంటున్నారు భాస్కరా హోటల్ నిర్వాహకులు. ‘‘ఆయ్! మా దగ్గర్లోని అమలాపురం, లొల్ల లాకులూ, ఆత్రేయపురం ప్రాంతాల్లో సూటింగ్‌లు ఎక్కువ జరుగాతయ్ కదండీ! అక్కడకి వచ్చే యాట్టర్లందరూ మా కుండబిర్యానీ రుసి చూడకుండా ఎల్లరండి బాబూ’’ అంటూ గర్వంగా చెబుతారు. కోనసీమ ముఖద్వారంగా పేరుపొందిన రావులపాలెం హైవేకు దగ్గరగా ఉండటంతో.. భోజనప్రియులైన ప్రయాణికులను ఆకర్షించడం కోసం ఈ కుండబీర్యానీ తయారు చేయించడం మొదలుపెట్టారు భాస్కరా హోటల్ నిర్వహకులు. 2005లో కుండబిర్యానికి తయారీ మొదలైంది. మొదట్లో పదికుండలతో మొదలుపెట్టిన ఈ వంటకం ఇప్పుడు వేలల్లో ఫ్యాన్స్‌ని సంపాదించుకుంది. రావులపాలెం, ఆ చుట్టుపక్కల ప్రాంతాలకే ఈ రుచి పరిమితం కాకుడా ఇతర జిల్లాలకూ వ్యాపించింది. రాత్రికి రాత్రి కుండబిర్యానీని చక్కగా ప్యాక్ చేసి బస్సుకి ఇచ్చేస్తే తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఉదయాన్నే తీసుకుంటున్నారు.కుండల్లోనే వండుతారు...
కుమ్మరి దగ్గర కావలసిన పరిమాణాల్లో కుండల్ని తయారు చేయించుకుంటారు. చికెన్‌ని ఓ మోస్తరు పరిమాణంలో ముక్కలు చేసుకుంటారు. ఈ ముక్కల్లోనే మటన్, చికెన్ మసాలాలతోపాటు భాస్కరా హోటల్ వాళ్లు ప్రత్యేకంగా తయారుచేసిన బిర్యానీ మసాలా, పాలు, పెరుగు, ఉప్పు, పసుపు, కారం వంటివన్నీ ముక్కలకు పట్టించి ఐదారుగంటలు అలానే పక్కన పెట్టి ఉంచుతారు. కుండలో అడుగున ఈ మసాలాను వేసి రోల్కాస్టర్పై కుండను ఉంచి ఉడికించి... ఆపై బాస్మతి బియ్యం దానిలో కలిపి మూతపెట్టేస్తారు. పైన బొగ్గుల వేడిని ఉంచుతారు. కింద సన్నని మంట, పైన వేడికి మసాలా మొత్తం రైస్‌కి పడుతుంది. చివరిగా వెన్న, రోజ్‌వాటర్ వేసి వేయించిన ఉల్లిపాయలతో అలంకరించి అల్యూమినియం ఫాయిల్ చుట్టేసి మరోసారి మంటపై వేడిచేసి వడ్డిస్తారు. ప్రత్యేక సందర్భాలు ఉంటే ముందస్తు బుకింగ్‌లు కూడా చేసుకోవాల్సి ఉంటుంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్‌ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా