తినేముందు ఒక్కక్షణం...

పండ్లు, కూరగాయలు, ఆకు కూరల్ని నీళ్లతో కడిగినా వాటిపై ఉండే రసాయనాలు, క్రిమి సంహారక మందులు ఓ పట్టాన పోవు. అలా తింటే అనారోగ్యం ఖాయం. అందుకే వాటిని సులువుగా శుభ్రం చేసే మార్గాలు మీకోసం...

Updated : 08 Dec 2022 22:00 IST

పండ్లు, కూరగాయలు, ఆకు కూరల్ని నీళ్లతో కడిగినా వాటిపై ఉండే రసాయనాలు, క్రిమి సంహారక మందులు ఓ పట్టాన పోవు. అలా తింటే అనారోగ్యం ఖాయం. అందుకే వాటిని సులువుగా శుభ్రం చేసే మార్గాలు మీకోసం...
ద్రాక్ష, జామ, యాపిల్‌, మామిడి, స్ట్రాబెర్రీ... వంటి పండ్లను పండించేటప్పుడు రసాయనాలు ఎక్కువగా వినియోగిస్తారు. దాంతో అవి పండ్లపై పూతలా పేరుకొని ఉంటాయి. వాటిని ఓ సారి నీళ్లతో కడిగేసి తినేస్తే మంచిది కాదు. అందుకు ఓ పద్ధతుంది. పెద్ద  గిన్నెలో నాలుగు కప్పుల గోరువెచ్చని నీళ్లు తీసుకుని రెండు చెంచాల ఉప్పు వేసి అరగంట సేపు పండ్లను మునిగేలా చేయాలి. ఆ తరువాత చల్లని నీటితో మరో రెండు సార్లు వాటిని శుభ్రపరచాలి. ఉప్పు వేసే బదులు వెనిగర్‌ని కూడా వినియోగించొచ్చు. ఇలా కడిగితే పండ్లపై ఉండే  టాక్సిన్లు, రసాయనాలు తొలగిపోతాయి.

* ఆకుకూరల్ని కోయడానికి ముందు పెద్ద గిన్నె లేదా టబ్‌లో సగానికిపైగా నీళ్లు పోసి అందులో ఉంచాలి. ఆ నీటిలో చెంచా వంట సోడా వేసి బాగా కలపాలి. ఆపై ఆకుకూరల్ని బయటకు తీసి  మంచి నీటితో కడిగి, పొడి వస్త్రంతో తుడవాలి. ఆ తరువాతే వాడుకోవాలి.
* పుట్టగొడుగుల్ని ముందు పొడి వస్త్రంతో తుడిచి, ఆపై ధారలా పడుతోన్న నీటితో కడగాలి. ఆ తరువాత మరోసారి తుడిచి వండుకోవచ్చు.
* పెద్ద గిన్నె నిండా నీళ్లు తీసుకుని చెంచా వంటసోడా వేయాలి. ఈ నీటిలో కూరగాయల్ని రెండు నిమిషాల పాటు మునిగేలా చేయండి. ఆ తరువాత వాటిని చేత్తో రుద్దుతూ మరో రెండు సార్లు పరిశుభ్రమైన నీటితో కడిగాకే వంటకు వాడాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని