నురగలకాఫీ..

చిక్కని నురగతో.. తెల్లగా, చల్లచల్లగా.. నోట్లోకి.. అక్కడి నుంచి గొంతులోకి అలా జారుతూ ఉంటే.. ఎంత హాయిగా ఉంటుందో చెప్పలేం.....

Published : 12 Apr 2020 00:19 IST

ఛాలెంజ్‌కు సిద్ధమేనా!

చిక్కని నురగతో.. తెల్లగా, చల్లచల్లగా.. నోట్లోకి.. అక్కడి నుంచి గొంతులోకి అలా జారుతూ ఉంటే.. ఎంత హాయిగా ఉంటుందో చెప్పలేం. ఆ రుచిని వర్ణించడానికి మాటలు సరిపోవు అంటున్నారు కాఫీ ప్రియులు. ఆ కాఫీయే... ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, టిక్‌టాక్‌, ఇంటర్నెట్‌లో హాట్‌ టాపిక్‌గా మారిపోయింది. అదే.. డాల్గొనా కాఫీ. లాక్‌డౌన్‌ సందర్భంగా ఇళ్లకే పరిమితమైన యువత దీన్ని తాగడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారట. దీన్నెలా తయారుచేసుకోవాలో మనమూ తెలుసుకుందామా...

మొన్నటి వరకూ కొరియా వాళ్లకి మాత్రమే తెలిసిన ఈ దల్గోనా కాఫీ.. ఇప్పుడు సోషల్‌ మీడియా ఛాలెంజ్‌ పుణ్యమాని అందరికీ తెలుస్తోంది. కాఫీప్రియుల మనసుదోచేసిన ఈ దల్గోనా ఇప్పుడు టిక్‌టాక్‌, ఇన్‌స్టాలలో హాట్‌ట్రెండ్‌గా మారింది.

కావాల్సినవి: ఇన్‌స్టెంట్‌ కాఫీ పౌడర్‌- రెండు టేబుల్‌ స్పూన్లు, పంచదార- రెండు టేబుల్‌ స్పూన్లు, వేడినీళ్లు- రెండు టేబుల్‌ స్పూన్లు, ఐస్‌క్యూబ్స్‌- నాలుగైదు, పాలు- 200 మి.లీ.

తయారీ: వెడల్పాటి గిన్నెలో ఇన్‌స్టెంట్‌ కాఫీ పొడి, పంచదార, వేడినీళ్లు వేసుకుని... ఈ మూడూ బాగా కలిసేలా కలపాలి. ఇప్పుడో గ్లాసులో నాలుగైదు ఐస్‌క్యూబ్‌లు వేసి మూడొంతుల పాలు పోయాలి. ఈ పాల మీద కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని పరుచుకున్నట్టుగా వేయాలి. చివర్లో పైన చిటికెడు కాఫీ పొడి చల్లుకుంటే... చల్లచల్లటి కాఫీని హాయిగా తాగేయొచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని