ఎండుద్రాక్ష తింటున్నారా...

చలికాలంలో దగ్గూ, జలుబులాంటి సమస్యలు ఇబ్బందిపెడుతుంటాయి. ఎండుద్రాక్షను తరచూ తీసుకోవడం వల్ల వీటి నుంచి బయటపడొచ్చు.

Published : 17 Jan 2021 00:37 IST

పోషకాలమ్‌

చలికాలంలో దగ్గూ, జలుబులాంటి సమస్యలు ఇబ్బందిపెడుతుంటాయి. ఎండుద్రాక్షను తరచూ తీసుకోవడం వల్ల వీటి నుంచి బయటపడొచ్చు. వీటివల్ల ఇంకా ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయంటే...
* నీరసంగా ఉన్నప్పుడు వీటిని తింటే తక్షణ శక్తి లభిస్తుంది.
* గొంతు సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. కఫాన్ని తగ్గించి దగ్గు రాకుండా చేస్తాయి.
* వీటిల్లో ఉండే కాల్షియం ఎముకలు దృఢంగా ఉండటానికి తోడ్పడుతుంది.
* ఎండుద్రాక్షలో పీచు పదార్థం అధికంగా ఉండటం వల్ల మలబద్ధకంతో ఇబ్బందిపడే వారికి ఔషధంలా పనిచేస్తుంది.
* వీటిలో ఉండే ఇనుము, కాపర్‌, బికాంప్లెక్స్‌ పోషకాలు రక్తహీనతను నివారిస్తాయి. దీంతో ఇబ్బందిపడే వాళ్లు తరచూ వీటిని తీసుకోవడం వల్ల ఫలితం ఉంటుందంటారు నిపుణులు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని