Updated : 21 Feb 2021 05:56 IST

బుజ్జాయికి స్వాగతం చెబుతున్నారిలా...

ఫుడ్‌ఆర్ట్‌

సీమంతం... ఎంత చక్కని వేడుకో కదా... కాబోయే అమ్మకు సంప్రదాయబద్ధంగా సీమంతం చేయడం తెలిసిందే. ఆ సమయంలో కడుపుతో ఉన్న అమ్మాయికి ఇష్టమైన వాటిని ప్రత్యేకంగా తినిపిస్తుంటారు. వేడుకకు హాజరైన అతిథులు కూడా రకరకాల స్వీట్లు, పండ్లు, చీరలు తెచ్చి కాబోయే తల్లికి అందిస్తుంటారు. ఇదంతా ఎప్పుడూ జరిగేదే. అయితే ఈమధ్య ఈ వేడుకలో కొత్తగా ‘బేబీషవర్‌ కుకీస్‌’ కూడా దర్శనమిస్తున్నాయి. రాబోయే బుజ్జాయికి స్వాగతం చెబుతూ తియ్యని ఈ బిస్కెట్లను చిన్నారి చిట్టిచిట్టి పాదాలు, పాలసీసా, చిన్నిచిన్ని దుస్తులు, బొమ్మల ఆకారాల్లో తయారుచేస్తున్నారు. చూడచక్కని ఈ కుకీస్‌ వేడుక అందాన్ని రెండింతలు చేస్తున్నాయి కూడా.


 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు