సూక్ష్మజీవులను చంపే వాండ్‌!

వంటగదిలో సింకును అదే పనిగా కడుగుతుంటాం. అలాగే వంటబండా, భోజనాల బల్ల... ఇలా అన్నింటిని తరచూ

Published : 16 May 2021 01:08 IST

వంటింటి నేస్తం

వంటగదిలో సింకును అదే పనిగా కడుగుతుంటాం. అలాగే వంటబండా, భోజనాల బల్ల... ఇలా అన్నింటిని తరచూ శుభ్రం చేస్తూనే ఉంటాం. కొవిడ్‌ మహమ్మారి రాకతో భయం మరింత పెరిగింది. దాంతో తుడిచిన వస్తువులను తుడవడం, పదేపదే శుభ్రం చేయడం అలవాటుగా మారుతోంది కొందరిలో. ఇలాంటివారి కోసమే ఈ పరికరం. ఇది క్షణాల్లో ఉపరితలాలపై ఉండే హానికారక సూక్ష్మజీవులను ఇట్టే చంపేస్తుంది. దీనిలోని యూవీ-సీ లైట్‌ టెక్నాలజీ సూక్ష్మజీవులను చంపడమే కాకుండా అన్నిచోట్ల వ్యాపించి ఉన్న బ్యాక్టీరియానూ అంతం చేస్తుంది. కిచెన్‌ కౌంటర్స్‌, ఆటవస్తువులు, పెంపుడు జంతువుల మంచాలు... ఇలా ఎక్కడైనా దీన్ని పెడితే ఆ ప్రాంతంలోని దుమ్ము, ధూళీతోపాటు హానికారక సూక్ష్మజీవులూ పూర్తిగా తొలగిపోతాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని