నేరేడు పండు... లాభాలు మెండు!

ఊదా, నలుపు రంగుల మిశ్రమంతో మిలమిలా మెరుస్తూ.. రుచికి కాస్త వగరుగా ఉండే నేరేడు పండ్లు ఈ కాలంలో ఎక్కువగా దొరుకుతాయి.

Updated : 20 Jun 2021 03:01 IST

పోష  కాలమ్‌

ఊదా, నలుపు రంగుల మిశ్రమంతో మిలమిలా మెరుస్తూ.. రుచికి కాస్త వగరుగా ఉండే నేరేడు పండ్లు ఈ కాలంలో ఎక్కువగా దొరుకుతాయి. వీటిని తినడం వల్ల కలిగే లాభాలేంటో చూద్దామా...

నేరేడు పండ్లలో యాంటీఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. వీటిని తింటే  ఇమ్యూనిటీ పెరుగుతుంది.

* చిన్నా, పెద్దా, మధుమేహులు, ఊబకాయులు... ఇలా అందరూ తినొచ్చు. 
* ఈ పండు కాస్త వగరుగా ఉంటుంది. దీంట్లో గాలిక్‌ యాసిడ్‌ కాస్త ఎక్కువ పరిమాణంలో ఉండటమే దీనికి కారణం. ఈ పండులో యాంథోసయనిన్స్‌ అనే రసాయనాలు మెండుగా ఉంటాయి. ఇవి ఇన్సులిన్‌ ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి. కాబట్టి మధుమేహులూ తినొచ్చు.
* వాంతులు, వికారంగా ఉన్నప్పుడు వీటిని తింటే తగ్గుముఖం పడతాయి.
* ఇవి కాలేయ పనితీరును మెరుగుపరుస్తాయి.
* నేరేడు పండ్లను క్రమం తప్పకుండా తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గి, మంచి కొలెస్ట్రాల్‌ పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
* నీటి వల్ల కలిగే ఇన్‌ఫెక్షన్లు ఈ పండ్లు తింటే తగ్గుముఖం పడతాయి. 
* నేరేడు పండ్లలో పిండిపదార్థాలు, మాంసకృత్తులతోపాటు ఫాస్ఫరస్‌, క్యాల్షియం, ఇనుము సమృద్ధిగా ఉంటాయి.  

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు