చోలే బటూర చక్కగా కుదరాలంటే!

బటూర తయారీకి మైదా వాడుతుంటారు. ఆరోగ్యం పట్ల ఎక్కువగా శ్రద్ధ ఉండేవారు సగం మైదా, సగం గోధుమ పిండి ఉపయోగిస్తారు. మైదాతో చేసిన బటూర చాలా రుచిగా ఉంటుంది. రెండు కప్పుల మైదాకు పావు చెంచా ఉప్పు, ఒకటిన్నర ...

Updated : 12 Sep 2021 05:50 IST

నాకు హోటల్‌లో చేసే చోలే బటూర అంటే చాలా ఇష్టం. వాటిని ఇంట్లో చేసుకోవచ్చా?

- రమ, హైదరాబాద్‌  

* బటూర తయారీకి మైదా వాడుతుంటారు. ఆరోగ్యం పట్ల ఎక్కువగా శ్రద్ధ ఉండేవారు సగం మైదా, సగం గోధుమ పిండి ఉపయోగిస్తారు. మైదాతో చేసిన బటూర చాలా రుచిగా ఉంటుంది. రెండు కప్పుల మైదాకు పావు చెంచా ఉప్పు, ఒకటిన్నర నుంచి రెండు చెంచాల ఉప్మా రవ్వ కలపాలి. పెద్ద చెంచా నెయ్యి లేదా నూనెని పొడి పిండిలో కలపాలి. ఇప్పుడు మూడు, నాలుగు పెద్ద చెంచాల పెరుగునూ వేసి పిండిలో బాగా కలపాలి. బటూర బాగా మెత్తగా, చక్కగా పొంగాలంటే అరచెంచా చొప్పున బేకింగ్‌ పొడి, బేకింగ్‌ సోడా కలపాలి. ఇవి అందుబాటులో లేనప్పుడు చెంచా ఫ్రూట్‌ సాల్ట్‌ చేర్చుకోవచ్చు.  

 బటూర పిండిని తడపడానికి గోరువెచ్చని నీళ్లు తీసుకోవాలి. ఒత్తితే తేలికగా గుంట పడేలా కలపాలి. బటూర చేసుకునేటప్పుడు పొడి పిండి వేయకుండా నూనె రాసి తీసుకోవాలి. ఇలా చేసుకున్న వాటిని పెద్ద కడాయిలో రెండు వైపులా వేయించుకోవాలి.

మరింత రుచి కోసం పిండిలో చెంచా చక్కరనూ జత చేసుకోవచ్చు. బటూరాలను ఒత్తిన వెంటనే ఫ్రై చేసుకోవాలి లేదంటే వాటిపై చిన్న చిన్న బుడగలు వచ్చి ఎక్కువగా పొంగవు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని