పాలతో అందం ఆరోగ్యం!

పాలు పోషకాలతో నిండి ఉంటాయి. చిన్నా, పెద్దా... అందరూ క్రమంతప్పకుండా తీసుకుంటే  అనారోగ్యం బారిన పడకుండా ఉంటాం.  పాలలోని పోషకాలు మనకు శక్తితోపాటు రక్షణనూ ఇస్తాయి. మరి ఈ పాలలో ఉండే మరిన్ని సుగుణాలేంటో చూద్దామా..

Published : 05 Feb 2023 16:40 IST

పాలు పోషకాలతో నిండి ఉంటాయి. చిన్నా, పెద్దా... అందరూ క్రమంతప్పకుండా తీసుకుంటే  అనారోగ్యం బారిన పడకుండా ఉంటాం.  పాలలోని పోషకాలు మనకు శక్తితోపాటు రక్షణనూ ఇస్తాయి. మరి ఈ పాలలో ఉండే మరిన్ని సుగుణాలేంటో చూద్దామా..

* పాలలో క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, జింక్‌, ఫాస్ఫరస్‌ పాంథోనిక్‌ యాసిడ్‌, సెలీనియమ్‌, నియాసిన్‌ లాంటి మూలకాలు, విటమిన్‌-ఎ, డి, బి6 లాంటి పోషకాలుంటాయి. వీటిలోని క్యాల్షియం దంతాలు, ఎముకలు దృఢంగా ఉండటానికి తోడ్పడుతుంది. ఆస్టియోపోరోసిస్‌ నుంచి కాపాడుతుంది.

* మాంసకృత్తులు కండరాలు బలపడటానికి దోహదపడతాయి. రోజూ రాత్రిపూట గ్లాసు పాలు తాగితే చక్కగా నిద్రపడుతుంది. కండరాలన్నీ సాంత్వన చెందుతాయి కూడా.  

* బరువు తగ్గాలనుకునేవారికి పాలు చక్కటి ఎంపిక. గోరువెచ్చని పాలలో కాస్తంత పసుపు వేసుకుని తాగితే గొంతునొప్పి, జలుబు దూరమవుతాయి.

* పోషకాలుండే పాలను రోజూ రెండు పూటలా తాగితే చర్మం కాంతిమంతంగా తయారవుతుంది.

* పాలలోని విటమిన్లు, మినరల్స్‌ ఒత్తిడిని తగ్గిస్తాయి.

* బడలికగా, అలసటగా అనిపించినప్పుడు ఓ గ్లాసు పాలు తాగి చూడండి. నిస్సత్తువ వెంటనే పోతుంది.

* క్రమం తప్పకుండా తాగుతూ ఉంటే శరీరం డీహైడ్రేట్‌ అవదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని