ఆరోగ్యాన్నిచ్చే ఔషధ శొంఠి!
అల్లాన్ని ఎండబెట్టి పొడి చేస్తారు. దీన్నే శొంఠిగా పిలుస్తారు. ఘాటుగా ఉండే దీనివల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
* ఇదిÈ ఉదయంపూట కలిగే వికారాన్ని తగ్గిస్తుంది. శొంఠి పొడి, తేనె, నిమ్మరసం కలిపి తీసుకుంటే వికారం, వాంతులు తగ్గుతాయి. ఇది జీవక్రియల వేగాన్ని పెంచుతుంది కూడా.
* జీర్ణసంబంధ సమస్యలకు చెక్ పెడుతుంది. అలాగే కొవ్వు స్థాయులను తగ్గిస్తుంది. బరువు నియంత్రణలోనూ తోడ్పడుతుంది. కాబట్టి రోజూ అన్నం తినే సమయంలో రెండు ముద్దల్లో కాస్తంత శొంఠిపొడి, నెయ్యి వేసుకుని తింటే చాలా మంచిది.
* గుండెకు మేలు చేస్తుంది. కొన్ని రకాల క్యాన్సర్లను అడ్డుకుంటుంది.
* వాపులు, నొప్పులను పోగొడుతుంది.
* దీనిలోని యాంటీఫంగల్ లక్షణాలు ఇన్ఫెక్షన్స్తో పోరాడతాయి.
* ఈ పొడిని క్రమం తప్పకుండా తీసుకుంటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
* నెలసరి సమయంలో వచ్చే నడుము, తలనొప్పులను తగ్గిస్తుంది.
* రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రిస్తుంది.
* ఎముకలు, కండరాల ఆరోగ్యానికి మంచిది.
* శొంఠి పొడి, మిరియాలు, యాలకులు, బెల్లం దంచి, మరిగే పాలలో కలిపి తాగితే జలుబు, దగ్గు లాంటివి తగ్గుతాయి.
* ఇది ఆకలిని పెంచడమే కాకుండా అరుగుదలను ప్రేరేపిస్తుంది. మజ్జిగలో శొంఠి పొడి కలిపి తాగితే సరి.
Advertisement
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Business News
Gas Cylinder: భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర
-
Ap-top-news News
Andhra News: 10.30కి వివాదం.. 8 గంటలకే కేసు!
-
Ap-top-news News
Margani Bharat Ram: ఎంపీ సెల్‌ఫోన్ మిస్సింగ్‌పై వివాదం
-
Ap-top-news News
Andhra News: ప్రభుత్వ బడిలో ఐఏఎస్ పిల్లలు
-
Ts-top-news News
Heavy Rains: నేడు, రేపు అతి భారీ వర్షాలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Gautham Raju: ప్రముఖ సినీ ఎడిటర్ గౌతమ్ రాజు కన్నుమూత
- Andhra News: మేకప్ వేసి.. మోసం చేసి.. ముగ్గురిని వివాహమాడి..
- RRR: ‘ఆర్ఆర్ఆర్.. గే లవ్ స్టోరీ’.. రసూల్ కామెంట్‌పై శోభు యార్లగడ్డ ఫైర్
- ఒకటే గొప్పనుకుంటే.. ఆరు చోట్ల సాధించింది!
- IND vs ENG: టీమ్ఇండియా ఓటమిపై రాహుల్ ద్రవిడ్ ఏమన్నాడంటే?
- Chennai: ‘ఓటీపీ’ వివాదం.. టెకీపై ఓలా డ్రైవర్ పిడిగుద్దులు.. ఆపై హత్య
- Kaali: ముదురుతున్న ‘కాళీ’ వివాదం.. దర్శకురాలు, నిర్మాతలపై కేసులు
- ప్రముఖ వాస్తు నిపుణుడి దారుణ హత్య.. శరీరంపై 39 కత్తిపోట్లు
- రూ.19 వేల కోట్ల కోత
- Abdul kalam: కలాం అలా కళ్లెం వేశారు!.. ముషారఫ్‌ను నిలువరించిన వేళ..