తేనెను గడ్డకట్టించి..

తేనెని ఇష్టపడనివాళ్లు ఎవరుంటారు? అయితే తేనెను అలా కాకుండా... గడ్డకట్టించి తినడం సోషల్‌మీడియాలో ట్రెండుగా మారింది. దీన్నే ఫ్రోజెన్‌ హనీ సవాల్‌ అని పిలుచుకుంటున్నారు.

Updated : 24 Oct 2021 05:45 IST

తేనెని ఇష్టపడనివాళ్లు ఎవరుంటారు? అయితే తేనెను అలా కాకుండా... గడ్డకట్టించి తినడం సోషల్‌మీడియాలో ట్రెండుగా మారింది. దీన్నే ఫ్రోజెన్‌ హనీ సవాల్‌ అని పిలుచుకుంటున్నారు. ఈ దీనిపై సుమారుగా 900 మిలియన్ల వీడియోలు రూపొందించారంటే సోషల్‌మీడియాలో ఇది ఎంతగా వైరల్‌ అవుతోందో తెలుస్తోంది. రామిరెజ్‌ అనే టిక్‌టాకర్‌ ఈ ట్రెండుకి శ్రీకారం చుట్టాడు. తేనె సీసాను ఐసుముక్కల మధ్య ఉంచి గడ్డకట్టిన తర్వాత క్యాండీలా చేసుకుని తింటారు. తేనెతోపాటు కార్న్‌సిరప్‌, రంగురంగుల ఫ్లేక్స్‌వాడి ఈ ట్రెండుని తక్కినవాళ్లూ వైరల్‌ చేస్తున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని