ఈ ఉప్పుది... పొగవాసన!

వంటలోకి ఉప్పు కావాలా... ఏ రకం ఉప్పు కావాలి? అదేం ప్రశ్న...  ఇందులో కూడా రకాలుంటాయా అనేగా మీ సందేహం. ఎందుకు ఉండవు? ఉప్పులోనూ అనేక రకాల రుచులు చేరుతున్నాయి. స్మోకీ సాల్ట్‌, సీజన్డ్‌ సాల్ట్‌ వంటివీ ఆ కోవలోకే వస్తాయి..

Updated : 07 Nov 2021 00:54 IST

వంటలోకి ఉప్పు కావాలా... ఏ రకం ఉప్పు కావాలి? అదేం ప్రశ్న...  ఇందులో కూడా రకాలుంటాయా అనేగా మీ సందేహం. ఎందుకు ఉండవు? ఉప్పులోనూ అనేక రకాల రుచులు చేరుతున్నాయి. స్మోకీ సాల్ట్‌, సీజన్డ్‌ సాల్ట్‌ వంటివీ ఆ కోవలోకే వస్తాయి..

స్మోకీ సాల్ట్‌: కూరలకి ముఖ్యంగా చేపలు, పీతలు వంటి సీఫుడ్‌కి ప్రత్యేక రుచిని ఇస్తుందీ స్మోకీ సాల్ట్‌. కర్రలని కాల్చి.. ఆ పొగను చూపించి ఈ ఉప్పుని ప్రత్యేకంగా తయారుచేస్తారు. ముఖ్యంగా ఓక్‌, హికరీ, యాపిల్‌ ఉడ్‌ వంటి చెక్కల నుంచి వచ్చిన పొగతో తయారు చేసిన ఉప్పుకి బాగా డిమాండ్‌ ఉంది. వాడిన చెక్క రకాన్ని బట్టి ధరను నిర్ణయిస్తారు. బార్బిక్యూ వంటలకు స్మోకీ రుచిని ఆపాదించే ఈ ఉప్పుకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు పెరుగుతున్నారు.

సీజన్‌ సాల్ట్‌: మామూలు టేబుల్‌ సాల్ట్‌తో పోలిస్తే కొంతవరకూ ఇది ఆరోగ్యదాయకం. కారణం ఈ ఉప్పులో హానికారక సోడియం స్థాయిలు తక్కువగా ఉండి... హెర్బల్స్‌ స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యానికి మేలు చేసే హెర్బల్స్‌ని జోడించి చేసిన ఈ సాల్ట్‌ సలాడ్స్‌, కూరలకి ప్రత్యేకమైన రుచిని తెస్తుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని