బాదం లాభాలు... బోలెడు
డ్రైఫ్రూట్స్‌లో బాదం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందే. ఇది రుచిగా ఉండటంతోపాటు తక్షణ శక్తిని, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. అవేంటో తెలుసుకుందామా...
డ్రైఫ్రూట్స్‌లో బాదం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందే. ఇది రుచిగా ఉండటంతోపాటు తక్షణ శక్తిని, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. అవేంటో తెలుసుకుందామా...
* బాదం బలవర్థక ఆహారం. ఇది శరీరానికి శక్తిని ఇస్తుంది.. వంద గ్రాముల బాదం నుంచి దాదాపు 579 కెలొరీలు అందుతాయి. సుమారు 49 గ్రాముల కొవ్వులు లభిస్తాయి. 21 గ్రా., ప్రొటీన్లు ఉంటాయి. మెగ్నీషియం, కాపర్, మాంగనీస్, లాంటి ఖనిజాలూ, ఒమేగా-3, 6 ఫ్యాటీ ఆమ్లాలు అధికం. మాంసకృత్తులతోపాటు పీచూ ఉంటుంది.
* చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. ఆరోగ్యాన్నిచ్చే మోనో అన్‌శాచురేటెడ్ కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. కొలెస్ట్రాల్ ఉండదు. విటమిన్-ఇ శాతం ఎక్కువే. ఇవన్నీ గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
* అధిక పిండిపదార్థాలుండే ఆహారానికి బదులుగా వీటిని తీసుకుని బరువును నియంత్రించుకోవచ్చు.
* మెదడు అభివృద్ధికి తోడ్పడుతుంది. ఎముకలు, దంతాలు బలంగా మారేలా చేస్తుంది. రక్తహీనత రాకుండా అడ్డుకుంటుంది.
* దీనిలోని విటమిన్-ఇ చర్మంలోని కొల్లాజెన్‌ను రక్షించి చర్మం ఎక్కువ కాలంపాటు యవ్వనంగా ఉండేలా చేస్తుంది. జుట్టు సమస్యలను తగ్గిస్తుంది.
* రోజూ గుప్పెడు తింటే చాలు కావాల్సిన శక్తి లభించడమే కాకుండా కడుపు నిండిన భావన కలిగి ఆకలి వేయదు. అయితే వీటిని నేరుగా కాకుండా నానబెట్టి పొట్టు తీసి తింటే వీటి నుంచి లభించే పోషకాలు మొత్తం శరీరానికి అందుతాయి. వీటిని పిల్లలు, పెద్దలు.. ఎవరైనా ఇలా నానబెట్టుకుని తినొచ్చు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్