పల్లీలతో ఆందోళన మాయం!

వేరుశనగను సామాన్యుడి జీడిపప్పుగా వ్యవహరిస్తారు. తక్షణ శక్తినిచ్చే వీటిలో పోషకాలూ అధికమే. ఆరోగ్యంతోపాటు సౌందర్యపోషణలోనూ ప్రధాన పాత్ర వహిస్తాయి. అవేంటో మనమూ తెలుసుకుందామా...

Updated : 05 Dec 2021 06:37 IST

వేరుశనగను సామాన్యుడి జీడిపప్పుగా వ్యవహరిస్తారు. తక్షణ శక్తినిచ్చే వీటిలో పోషకాలూ అధికమే. ఆరోగ్యంతోపాటు సౌందర్యపోషణలోనూ ప్రధాన పాత్ర వహిస్తాయి. అవేంటో మనమూ తెలుసుకుందామా...

* వీటిని పల్లీలని కూడా పిలుస్తారు. 100 గ్రాముల వేరుశనగల నుంచి దాదాపు 567 కెలొరీల శక్తి లభ్యమవుతుంది. పిండి పదార్థాలు- 21 గ్రా., ప్రొటీన్లు- 25 గ్రా., కొవ్వు- 48 గ్రా., పీచు- 9 గ్రా., ఉంటాయి.

* పల్లీలను ఆరేడు గంటలు నానబెట్టి వాడుకుంటే తేలికగా జీర్ణమవుతాయి. పచ్చి వేరుశనగ పప్పులను తింటే మరీ మంచిది. వీటిలో కొలెస్ట్రాల్‌ జీరో.  

* గుండె జబ్బులు తగ్గిస్తాయి. కండరాలకు బలాన్ని చేకూరుస్తాయి.  

* ఎక్కువ మొత్తంలో మాంసకృత్తులు, అమైనో ఆమ్లాలు ఉంటాయి. ఇవి కండరాల ఆరోగ్యానికి ఉపకరిస్తాయి.  

* మంచి కొవ్వులూ అధికమే. విటమిన్‌-ఇ, సి సమృద్ధిగా ఉంటాయి. ఇవి జుట్టుతోపాటు చర్మాన్నీ రక్షిస్తాయి.

* పల్లీల్లోని సమ్మేళనాలు ఆందోళన, ఒత్తిళ్లను తగ్గిస్తాయి.  

* రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రిస్తాయి.

* ఈ శక్తిమంతమైన గింజలను తినడం వల్ల ఎముకలు ఆరోగ్యంగా మారతాయి.                                   

* వీటి నుంచి విటమిన్లు, మినరల్స్‌ మెండుగా లభిస్తాయి.

* వీటిలో ప్రొటీన్లు, పీచు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని