మెదడుకు శక్తి... వాల్‌నట్స్‌

మెదడు ఆకారాన్ని పోలి ఉండే ఈ డ్రైఫ్రూట్‌.. నట్స్‌ అన్నింట్లో కల్లా బలమైన ఆహారం. అయితే వీటిలో కొవ్వు శాతం కాస్త ఎక్కువే. 100 గ్రాముల....

Updated : 12 Dec 2021 05:22 IST

మెదడు ఆకారాన్ని పోలి ఉండే ఈ డ్రైఫ్రూట్‌.. నట్స్‌ అన్నింట్లో కల్లా బలమైన ఆహారం. అయితే వీటిలో కొవ్వు శాతం కాస్త ఎక్కువే. 100 గ్రాముల వాల్‌నట్స్‌ నుంచి దాదాపు 64 శాతం కొవ్వు, 687 కెలొరీల శక్తి లభ్యమవుతాయి.  ప్రొటీన్లు- 15 గ్రా.,  పిండిపదార్థాలు- 11 గ్రా., ఉంటాయి.

* ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండెకు మేలు చేసే గుడ్‌ కొలెస్ట్రాల్‌ను పెంపొందిస్తాయి.
* వీటిలో ఒమేగా ఫ్యాటీ-3 ఆమ్లాలతోపాటు  పాలీఫినాల్స్‌ కూడా మెండుగానే ఉంటాయి. ఇవి ఫ్రీరాడికల్స్‌ను నిరోధిస్తాయి.
* వీటిని తింటే మెదడు ఆరోగ్యానికి చాలా మంచిది. అల్జీమర్స్‌, డిమెన్షియా లాంటి అనారోగ్యాలు దరిచేరవు.
* పేగుల్లో మంచి బ్యాక్టీరియాను ఈ వాల్‌నట్స్‌ వృద్ధి చేస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి.
* వీటిలో విటమిన్లు, క్యాల్షియం, పొటాషియం, సోడియం, కాపర్‌, మాంగనీస్‌ లాంటి ఖనిజ లవణాలు ఎక్కువగా ఉంటాయి. ఫోలిక్‌ యాసిడ్‌ కూడా అధికమే. రక్తహీనతతో బాధపడేవారు వీటిని తీసుకుంటే చాలా మంచిది.  
* యాంటీఆక్సిడెంట్లు, యాంటీఇన్‌ఫ్లమేటరీ గుణాలు కూడా ఎక్కువే. అధిక బరువు ఉన్నవారు వీటిని తింటే త్వరగా ఆకలి వేయదు. దాంతో బరువు నియంత్రణలో ఉంటుంది.
* వీటిని నానబెట్టుకుని తింటే చాలా మంచిది. దీంట్లో పీచు అధిక మొత్తంలో ఉంటుంది. చిన్నాపెద్దా అందరూ తినొచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని