ఒక్క తీపి బోలెడు రకాలు!

చక్కెర అనగానే మనకు వైట్‌, బ్రౌన్‌ రెండు రకాలే గుర్తుకు వస్తాయి. అయితే ఇవే కాకుండా రకరకాల చక్కెరలుంటాయి. వీటిని వంటల్లోనూ వాడుకోవచ్చు. అవేంటో చూద్దామా...

Updated : 12 Dec 2021 04:06 IST

చక్కెర అనగానే మనకు వైట్‌, బ్రౌన్‌ రెండు రకాలే గుర్తుకు వస్తాయి. అయితే ఇవే కాకుండా రకరకాల చక్కెరలుంటాయి. వీటిని వంటల్లోనూ వాడుకోవచ్చు. అవేంటో చూద్దామా...

ఫ్రూట్‌ షుగర్‌... దీని రేణువులు సహజమైన చక్కెర రేణువుల కంటే చిన్నగా ఉంటాయి. అయితే తీపి మాత్రం చక్కెర లానే ఉంటుంది. పుడ్డింగ్‌ల్లో దీని వినియోగం అవసరమవుతుంది.

కేన్‌ షుగర్‌..  చెరకు నుంచి తయారుచేసిన చక్కెర ఇది. దీన్ని గ్రాన్యూల్‌ షుగర్‌ ఉపయోగించే ఏ వంటకంలోనైనా ఎంచక్కా వాడుకోవచ్చు.

గ్రాన్యూలేటెడ్‌ షుగర్‌... ఇదీ చాలా సాధారణంగా వాడే చక్కెరే. ఎక్కువగా కేక్స్‌, కుకీస్‌, బేకింగ్‌ పదార్థాల తయారీలో దీన్ని వినియోగిస్తారు. కొలవడం చాలా సులభం.

మస్కొవడో షుగర్‌... ఇది చాలా తియ్యగా ఉంటుంది. అలాగే తక్కువ ప్రాసెస్‌ చేసిన చక్కెరల్లో ఒకటి. దీన్ని పుడ్డింగ్‌, క్యాండీల తయారీలో వినియోగిస్తారు. దీని సహజ రుచి వల్ల ఆయా వంటకాల టేస్ట్‌ మరింత పెరుగుతుంది.

పెరల్‌ షుగర్‌... దీన్ని నిబ్‌ షుగర్‌ అని కూడా పిలుస్తారు. స్ఫటికాలు నొక్కుకుపోయి పెద్ద నిబ్స్‌లా కనిపిస్తాయి. పేస్ట్రీలు, స్వీట్‌ బన్స్‌ పై స్ప్రింకిల్‌ చేయడానికి వాడతారు.

లిక్విడ్‌ షుగర్‌... షుగర్‌ సిరప్‌ అని కూడా పిలుస్తారు. చక్కెర, నీళ్లను సమాన పరిమాణాల్లో కలిపి దీన్ని తయారుచేస్తారు. కాక్‌టెయిల్స్‌, టీ, కాఫీ తయారీలో ఉపయోగిస్తారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని