మీఠా ఖర్జూరా తిందామా!

ముదురు గోధుమ రంగులో మెరుస్తూ... చక్కెరకు ప్రత్యామ్నాయంగా... సలాడ్లు, స్వీట్స్‌లో సహజ తీపి దనం కోసం.. జుట్టు పెరగడానికి... రక్తహీనతను తగ్గించడానికి... ఇలా ఖర్జూరతో ఒక్కటేమిటి బోలెడు ప్రయోజనాలున్నాయి.

Updated : 19 Dec 2021 06:02 IST

ముదురు గోధుమ రంగులో మెరుస్తూ... చక్కెరకు ప్రత్యామ్నాయంగా... సలాడ్లు, స్వీట్స్‌లో సహజ తీపి దనం కోసం.. జుట్టు పెరగడానికి... రక్తహీనతను తగ్గించడానికి... ఇలా ఖర్జూరతో ఒక్కటేమిటి బోలెడు ప్రయోజనాలున్నాయి.

* 100 గ్రాముల ఖర్జూర పండు నుంచి 144 గ్రా. శక్తి లభిస్తుంది. ప్రొటీన్లు తక్కువ. ఐరన్‌, జింక్‌, పొటాషియం, ఫాస్ఫేట్‌ ఖనిజాలతోపాటు దీంట్లో పీచు అధిక మొత్తంలో ఉంటుంది. 

* రుచే కాదు ఆరోగ్యాన్ని పరిరక్షించే పండు ఇది. తరచూ తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. 

* రోజూ తింటే డయేరియా, మలబద్ధకం సమస్యలకు దూరంగా ఉండొచ్చు.

* రెటినా, ఇతర నేత్ర సమస్యలను తగ్గించి కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

* పరిమితంగా తీసుకుంటూ బరువును అదుపులో ఉంచుకోవచ్చు.

* రక్తహీనతతో బాధపడేవారు తరచూ తీసుకుంటే తగినంత శక్తి లభించడంతోపాటు అనీమియా సమస్య తగ్గుతుంది.

* దీంట్లోని ఖనిజ లవణాల వల్ల ఎముకలు బలంగా, ఆరోగ్యంగా మారతాయి. 

* గింజలను తీసేసి పేస్ట్‌ చేసుకుని ఫ్రిజ్‌లో నిల్వ చేసుకోవచ్చు. ఈ గుజ్జును, జ్యూస్‌లు, కుకీస్‌, స్వీట్లలో వాడుకోవచ్చు. 

* ఖర్జూరం ముక్కలను సలాడ్స్‌, మొలకలు, కూరల్లో వాడుకోవచ్చు.

* జీర్ణాశయ సమస్యలకు చెక్‌ పెడుతుంది.

* దీంట్లోని ఐరన్‌ జుట్టు ఊడకుండా సాయపడుతుంది. అలాగే  ఇతర పోషకాలు మేనును మెరిపిస్తాయి.

* గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది.

* వీటి నుంచి లభించే కెలొరీలు అధికం. కాబట్టి నియమితంగా తీసుకుంటే సరి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు