చవులూరించే మర్జిపాన్‌

నీళ్లను మరిగించి బాదంపప్పు వేసి అయిదు నిమిషాలు ఉడకబెట్టాలి. ఆ తర్వాత దాన్ని చల్లార్చి పొట్టు తీసి పేస్ట్‌ చేసుకోవాలి. ఇందులో చక్కెర పొడి, వెనిల్లా, బాదం ఎసెన్స్‌లను వేసి మళ్లీ మిక్సీ పట్టుకోవాలి. ప్లేటు

Published : 26 Dec 2021 00:43 IST

కావాల్సినవి: బాదం, చక్కెర పొడి- కప్పు చొప్పున, వెనిల్లా ఎక్స్‌ట్రాక్ట్‌- మూడు చుక్కలు, బాదం ఎక్స్‌ట్రాక్ట్‌- మూడు చుక్కలు.

తయారీ: నీళ్లను మరిగించి బాదంపప్పు వేసి అయిదు నిమిషాలు ఉడకబెట్టాలి. ఆ తర్వాత దాన్ని చల్లార్చి పొట్టు తీసి పేస్ట్‌ చేసుకోవాలి. ఇందులో చక్కెర పొడి, వెనిల్లా, బాదం ఎసెన్స్‌లను వేసి మళ్లీ మిక్సీ పట్టుకోవాలి. ప్లేటు మీద మూడు చెంచాల చక్కెర పొడి చల్ల్లాలి. తయారుచేసుకున్న మిశ్రమాన్ని ఈ పొడి మీద వేసి చపాతీ పిండిలా చేసుకోవాలి. ఈ పిండి ముద్దను గాలి చొరబడని బ్యాగులో పెట్టి ఫ్రిజ్‌లో రెండు గంటలు భద్రపరచాలి. ఆ తర్వాత బయటకు తీసి కావాల్సిన ఆకారాల్లో ముక్కలుగా కోసుకుంటే మర్జిపాన్‌ రెడీ.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని