బర్నర్‌ శుభ్రం చేయడం తేలిక!

గ్యాస్‌ పొయ్యి చుట్టూ, కుళాయిల చుట్టుపక్కల... శుభ్రం చేయడానికి అనువుగా లేనిచోట మురికి పేరుకు పోతుంటుంది. ఇలాంటి వాటిని శుభ్రపరచడానికి సాధారణంగా ఇంట్లోని పాత టూత్‌బ్రష్‌లని వాడుతుంటాం. అయినా వాటి కుచ్చులు మృదువుగా ఉండటంతో అవి అనుకున్న విధంగా శుభ్రం కావు.

Published : 02 Jan 2022 01:29 IST

గ్యాస్‌ పొయ్యి చుట్టూ, కుళాయిల చుట్టుపక్కల... శుభ్రం చేయడానికి అనువుగా లేనిచోట మురికి పేరుకు పోతుంటుంది. ఇలాంటి వాటిని శుభ్రపరచడానికి సాధారణంగా ఇంట్లోని పాత టూత్‌బ్రష్‌లని వాడుతుంటాం. అయినా వాటి కుచ్చులు మృదువుగా ఉండటంతో అవి అనుకున్న విధంగా శుభ్రం కావు. బజారులో లోహంతో చేసిన తీగ బ్రష్‌లు లభ్యమవుతున్నాయి. ఇవి చూడటానికి  టూత్‌బ్రష్‌ల మాదిరిగానే ఉంటాయి. కానీ లోహంతో చేయడం వల్ల మూసుకు పోయిన గ్యాస్‌ బర్నర్‌లనీ, కుళాయిల చుట్టూ... పైనుండే చిమ్నీని శుభ్రం చేయడం చాలా తేలిక అవుతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని