ఈ బఠాణీ... పోషకాల గని!

లేతపచ్చిబఠాణీలను కూరల్లోనే కాదు సాయంకాలాల్లో స్నాక్స్‌లా తీసుకోవచ్చు. ఇతర ఎండుఫలాలతో కలిపి ఎంచక్కా లాగించేయొచ్చు. కొవ్వులు లేని ఈ గింజల వల్ల కలిగే ప్రయోజనాలు బోలెడు.

Updated : 09 Jan 2022 06:33 IST

లేతపచ్చిబఠాణీలను కూరల్లోనే కాదు సాయంకాలాల్లో స్నాక్స్‌లా తీసుకోవచ్చు. ఇతర ఎండుఫలాలతో కలిపి ఎంచక్కా లాగించేయొచ్చు. కొవ్వులు లేని ఈ గింజల వల్ల కలిగే ప్రయోజనాలు బోలెడు.

* 100 గ్రాముల పచ్చి బఠాణీల్లో మూడొంతుల నీరే ఉంటుంది. మాంసకృత్తులు, పీచు 5.5 గ్రా. ఉండగా.. 84 కెలొరీల శక్తి లభిస్తుంది. వీటిలో ప్రొటీన్లు, సూక్ష్మపోషకాలు, విటమిన్లతోపాటు క్యాల్షియం, ఇనుము, కాపర్‌, జింక్‌, మాంగనీస్‌ లాంటి ఖనిజాలూ ఎక్కువే.

* పీచు దండిగా ఉండే బఠాణీలను తింటే మలబద్ధకం సమస్య ఉత్పన్నం కాదు. ఇవి జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తాయి. కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
* వీటిలో విటమిన్‌-సి పుష్కలంగా ఉంటుంది. కాబట్టి క్రమం తప్పకుండా తీసుకుంటే రోగనిరోధకత పెరుగుతుంది.
* ఈ గింజల్లోని విటమిన్‌-కె ఎముకకు ఆరోగ్యాన్నిచ్చి ఆస్టియోపోరోసిస్‌ రాకుండా అడ్డుకుంటుంది. ముఖ్యంగా మహిళలు తమ రోజువారీ ఆహారంలో వీటిని చేర్చుకుంటే. వ్యాధి బారిన పడకుండా ఉండొచ్చు.

* వీటిని తింటే ఆరోగ్యమే కాదు అందం కూడా. ఈ గింజలు తినడం వల్ల చర్మంపై ముడతలు, గీతలు రావు. అంటే వృద్ధాప్య ఛాయలు దరి చేరవన్నమాట.
* బరువు తగ్గాలనుకునేవారు ఓ చిన్న కప్పు ఉడికించిన లేత బఠాణీలను స్నాక్‌లా తినొచ్చు. దాంతో కడుపు నిండిన భావన కలిగి చాలాసేపటి వరకు ఆకలి వేయదు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని