గిన్నెలు తోమే బ్రష్‌ కావాలా!

పదే పదే పాత్రలను శుభ్రం చేయడం వల్ల మహిళల చేతులు పొడిబారతాయి. డిష్‌వాషర్‌లోని రసాయనాలు చర్మంపై మరింత  ప్రభావాన్ని చూపి నిర్జీవమయ్యేలా చేస్తాయి.

Published : 23 Jan 2022 00:46 IST

పదే పదే పాత్రలను శుభ్రం చేయడం వల్ల మహిళల చేతులు పొడిబారతాయి. డిష్‌వాషర్‌లోని రసాయనాలు చర్మంపై మరింత  ప్రభావాన్ని చూపి నిర్జీవమయ్యేలా చేస్తాయి. అలాకాకుండా ఉపయోగపడేదే ఈ సరికొత్త సోప్‌ డిస్పెన్సింగ్‌ డిష్‌ బ్రష్‌. దీనికి కిందనున్న చిన్న సీసాలో లిక్విడ్‌వాష్‌ పోసి మూత పెట్టి దానిపై బ్రష్‌ను బిగించవచ్చు. చిన్న మీట నొక్కితే కావాల్సినంత లిక్విడ్‌ సోప్‌ బయటకు వస్తుంది. దీంతో ఇత్తడి, స్టీలు, నాన్‌స్టిక్‌, గాజు, ఇనుము.. ఇలా పాత్రలన్నింటినీ తేలికగా శుభ్రం చేయొచ్చు. కేవలం బ్రష్‌ మాత్రమే కాకుండా కావాలంటే రకరకాల సైజుల్లో ఉండే స్క్రబ్బర్స్‌నూ దీనికి అమర్చవచ్చు. భలే ఉంది కదూ. మరెందుకాలస్యం మీరూ కొనేయండి మరి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు