సంపూర్ణ ఆరోగ్యానికి కొబ్బరి!

ఆరోగ్యం, బలం, జ్ఞాపకశక్తిని అందించే పదార్థాల్లో కొబ్బరి ఒకటి. ముఖ్యంగా పచ్చి కొబ్బరి తింటే బోలెడు లాభాలున్నాయి. అవేంటో తెలుసుకుందామా...

Published : 06 Feb 2022 00:26 IST

ఆరోగ్యం, బలం, జ్ఞాపకశక్తిని అందించే పదార్థాల్లో కొబ్బరి ఒకటి. ముఖ్యంగా పచ్చి కొబ్బరి తింటే బోలెడు లాభాలున్నాయి. అవేంటో తెలుసుకుందామా...

* 100 గ్రాముల పచ్చికొబ్బరి నుంచి 354 కెలొరీల శక్తి లభిస్తుంది. పిండిపదార్థాలు 15 గ్రా.,  కొవ్వులు 33 గ్రా., పీచు 10 గ్రా., అందుతాయి. పీచు, విటమిన్లు, అమైనో ఆమ్లాలు, క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్‌, కాపర్‌ లాంటి ఖనిజాలు దండిగా ఉంటాయి. కొబ్బరిని తినడం వల్ల ఎముకలు, దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. పిల్లలు, పెద్దలు, మహిళలు... అందరూ తినొచ్చు. కొబ్బరిలో పిండిపదార్థం తక్కువగా, పీచు ఎక్కువగా ఉంటుంది. దాంతో రక్తంలో చక్కెరస్థాయులు నిలకడగా ఉంటాయి. కాబట్టి దీన్ని తింటే మధుమేహం అదుపులో ఉంటుంది. దీంట్లోని శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్లు.. కణాలు ఆక్సిడేటివ్‌ ప్రభావానికి గురికాకుండా చూస్తాయి. అంటే వృద్ధాప్య ఛాయలు రాకుండా అడ్డుకుంటాయన్నమాట. కొబ్బరి మూత్ర సంబంధ సమస్యలను తగ్గిస్తుంది. జీర్ణక్రియ సాఫీగా సాగేలా చేస్తుంది.
* హృదయ సంబంధ సమస్యలను తగ్గించి, రక్తపోటును నియంత్రిస్తుంది. తెలివితేటలను పెంచడానికి ఉపయోగపడుతుంది. అల్జీమర్స్‌ రాకుండా అడ్డుకుని జ్ఞాపకశక్తిని పెంచుతుంది. కొబ్బరి తినడం వల్ల రోగనిరోధకత పెరుగుతుంది. దీంట్లో యాంటీవైరల్‌, యాంటీబ్యాక్టీరియల్‌, యాంటీ పారాసైటిక్‌ సమ్మేళనాలుంటాయి. ఇవి శరీరానికి హాని చేసే అన్ని రకాల సూక్ష్మజీవులను చంపేస్తాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని