పెంకు మూతలా వచ్చేస్తుంది!

ఆమ్లెట్‌ చేయడానికో... కూరలో వేయడానికో గుడ్డును పగలగొట్టేటప్పుడు కొన్నిసార్లు చేయి జారడమో, పెంకులు గుచ్చుకుపోవడమో జరుగుతుంది. ఒక్కోసారి అవి వండే పాత్రలోనూ పడిపోతాయి. పచ్చసొన, తెల్లసొన

Published : 13 Feb 2022 01:38 IST

ఆమ్లెట్‌ చేయడానికో... కూరలో వేయడానికో గుడ్డును పగలగొట్టేటప్పుడు కొన్నిసార్లు చేయి జారడమో, పెంకులు గుచ్చుకుపోవడమో జరుగుతుంది. ఒక్కోసారి అవి వండే పాత్రలోనూ పడిపోతాయి. పచ్చసొన, తెల్లసొన కింద పడే ప్రమాదమూ ఉంది. ఈ ఫొటోలో కనిపిస్తున్న పరికరం ‘ఎగ్‌షెల్‌ కట్టర్‌’ అన్ని సమస్యలకు చెక్‌ పెడుతుంది. చిటికెలో చక్కగా గుడ్డు పైభాగాన్ని పగలగొట్టేస్తుంది. స్టెయిన్‌లెస్‌ స్టీల్‌తో తయారైన ఈ పరికరాన్ని ఉపయోగించి క్షణాల్లో గుడ్డును పగలగొట్టొచ్చు. చేత్తో గుడ్డును పట్టుకుని పరికరాన్ని దానిపై భాగంలో పెట్టి స్క్రూ బిగించి ఓసారి తిప్పితే చాలు పై పెచ్చు మూతలా ఊడి వచ్చేస్తుంది. సొన బయటకు రాదు. దీన్ని ఉపయోగించి ఉడికిన గుడ్డు పెంకునూ సులువుగా తీసేయొచ్చు. శుభ్రం చేయడమూ తేలికే.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని