ఒలిచి పెడుతుంది!

గుప్పెడు పచ్చి బఠాణీ గింజలు కావాలనుకుంటే చకాచకా ఒలిచేస్తాం. అయితే కాస్త పెద్ద మొత్తంలో అవసరమైతే.... ఉరుకులు, పరుగులు పెట్టే ఈ బిజీ బిజీ కాలంలో  కాస్త కష్టమే. మరి సులువైన మార్గమేదైనా ఉందా...

Updated : 27 Feb 2022 06:32 IST

గుప్పెడు పచ్చి బఠాణీ గింజలు కావాలనుకుంటే చకాచకా ఒలిచేస్తాం. అయితే కాస్త పెద్ద మొత్తంలో అవసరమైతే.... ఉరుకులు, పరుగులు పెట్టే ఈ బిజీ బిజీ కాలంలో  కాస్త కష్టమే. మరి సులువైన మార్గమేదైనా ఉందా...

ఫొటోలో కనిపిస్తోన్న ఈ మెషీన్‌ క్షణాల్లో గింజలను ఒలిచేస్తుంది. ‘పీ షెల్లర్‌ హ్యాండ్‌ రోలింగ్‌ మెషీన్‌’ గా పిలుస్తారు దీన్ని. ముందు భాగంలో ఉన్న ఆకుపచ్చని పదునైన పళ్ల మధ్య బఠాణీలుండే కాయను పెట్టి మరో చేత్తో హ్యాండిల్‌ తిప్పాలి. గింజలు కిందనున్న కప్పులాంటి భాగంలో, తొక్కలు వెనకవైపు పడిపోతాయి. దీంతో బీన్స్‌, సోయాబీన్‌, బఠాణీ గింజలను ఎంచక్కా ఒలిచేయొచ్చు. ఎప్పటికప్పుడు తాజా బఠాణీలను తినొచ్చు. శుభ్రం చేయడమూ తేలికే. ధర కూడా తక్కువే. ఇది వంటింట్లో ఉండాల్సిన వస్తువే... కాదంటారా..


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని