ఉపవాసం ముగిశాక...

మహాశివరాత్రి రోజు చాలామంది ఉపవాసం ఉంటారు. కొందరైతే ఉదయం నుంచి సాయంత్రం వరకు నీళ్లు కూడా తాగరు. రాత్రికి కేవలం పండ్లనే ఆహారంగా తీసుకుంటారు. ఇలా రోజంతా ఉపవాసం ఉన్నప్పుడు ఏం తీసుకోవాలంటే..

Updated : 27 Feb 2022 06:26 IST

హాశివరాత్రి రోజు చాలామంది ఉపవాసం ఉంటారు. కొందరైతే ఉదయం నుంచి సాయంత్రం వరకు నీళ్లు కూడా తాగరు. రాత్రికి కేవలం పండ్లనే ఆహారంగా తీసుకుంటారు. ఇలా రోజంతా ఉపవాసం ఉన్నప్పుడు ఏం తీసుకోవాలంటే..

పండ్లు..  కర్బూజా, తర్బూజాల్లో నీటి శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. తర్బూజలో చక్కెర శాతం అధికం. త్వరగా జీర్ణమయ్యే చక్కెరలు రెండింటిలోనూ దండిగా ఉంటాయి. దాహం తీర్చడమే కాకుండా శరీరానికి కావాల్సిన ఖనిజ, లవణాలనూ అందిస్తాయివి. మిగతా దుంపలతో పోలిస్తే చిలగడ దుంపలోనూ సరళ చక్కెరలు ఎక్కువ. ఇవి రక్తంలో చక్కెర శాతాన్ని పెంచుతాయి. వీటిని తింటే తక్షణ శక్తి లభిస్తుంది.

పాలు కూడా... ఖర్జూరంలో పిండిపదార్థాలు పుష్కలం. పొట్ట నిండిన భావన కలిగిస్తాయి. తక్షణ శక్తిని అందిస్తాయి. సులభంగా అరుగుతాయి. శక్తి ఖజానాగా చెప్పొచ్చు. ఇనుము ఎక్కువ మొత్తంలో ఉంటుంది. అలాగే సరళ చక్కెరలు కూడా. దీని నుంచి అందే కెలొరీలు కూడా అత్యధికమే... కాబట్టి ఒకటి తిన్నా ఉత్సాహంగా ఉంటారు. కాలానుగుణంగా వచ్చే పండ్లలో ద్రాక్ష ఒకటి. ఈ సమయంలో ఎక్కువగా అమ్ముతుంటారు. దీంట్లో చక్కెర రూపంలో శక్తి దాగి ఉంటుంది. కాబట్టి వీటిని తినగానే శరీరం ఉత్తేజంగా మారుతుంది. కమలాపండులో నీరు, పొటాషియం, విటమిన్‌ సి.... దండిగా ఉంటాయి. ఇవి దప్పికను తీర్చడంతోపాటు తక్షణ శక్తిని అందిస్తాయి. ఇక పాల గురించి చెప్పాలంటే చాలా శ్రేష్ఠమైనవి. దీంట్లో అన్ని రకాల పోషకాలుంటాయి. విటమిన్లు, క్యాల్షియం, ప్రొటీన్లు మెండుగా ఉంటాయి. ఇవి నాడులు, కండరాలకు తగినంత శక్తిని అందిస్తాయి.

-డాక్టర్‌ జానకీశ్రీనాథ్‌, పోషకాహార నిపుణులు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని