క్రీమీ టొమాటో పాలక్‌ పాస్తా!

మాకరోనీ- రెండు కప్పులు, ఆలివ్‌ నూనె- రెండు చెంచాలు, వెల్లుల్లి రెబ్బలు- నాలుగు (సన్నగా తరగాలి), టొమాటోలు- రెండు (ముక్కలుగా కోయాలి), పుట్టగొడుగులు

Updated : 27 Feb 2022 06:30 IST

కావాల్సినవి: మాకరోనీ- రెండు కప్పులు, ఆలివ్‌ నూనె- రెండు చెంచాలు, వెల్లుల్లి రెబ్బలు- నాలుగు (సన్నగా తరగాలి), టొమాటోలు- రెండు (ముక్కలుగా కోయాలి), పుట్టగొడుగులు- మూడు (తరగాలి), పాలకూర - కట్ట (సన్నగా తరగాలి), నల్లమిరియాల పొడి- చెంచా, మయొనైజ్‌- అయిదు చెంచాలు, నీళ్లు- లీటరు, ఉప్పు- తగినంత.

తయారీ: పాత్రలో నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టాలి. అవి మరుగుతున్నప్పుడు మాకరోనీ, ఉప్పు వేయాలి. అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. ఇలా అయిదారు నిమిషాలు ఉడికించాలి. ఉడికిన పాస్తాను చిల్లులున్న పాత్రలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి.
పాన్‌లో నూనె వేసి వేడయ్యాక సన్నమంటపై వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలను వేసి రంగు మారేదాకా వేయించాలి. టొమాటోలను వేసి రెండు నిమిషాలు ఉడికించాలి. మష్రూమ్‌ ముక్కలు, పాలకూర తరుగు జతచేసి నీరంతా పోయేదాకా కాసేపు మగ్గించాలి. ఉప్పు, మిరియాల పొడి వేస్తే రుచి పెరుగుతుంది. కప్పు పాస్తా స్టాకును కూడా కలపాలి. ఆ తర్వాత పొయ్యిపై నుంచి పాన్‌ను దించేయాలి. ఇప్పుడు మయొనైజ్‌ వేసి కలపాలి. మళ్లీ స్టవ్‌ మీద పెట్టి  సన్నని మంటపై నిమిషం లేదా సాస్‌ గట్టిపడేవరకు ఉంచాలి. సాస్‌కి మాకరోనీ జత చేసి మరోసారి కలిపి స్టవ్‌ ఆఫ్‌ చేసి వేడి వేడిగా వడ్డించాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని