వేడిగా.. చల్లగా.. వాడేయొచ్చు

సంతకో, సూపర్‌ మార్కెట్‌కో వెళ్లినప్పుడు చేతి సంచి తీసుకువెళ్లడం ఇంతకు ముందు చాలామందికి అలవాటుగా ఉండేది. పాలిథీన్‌ కవర్లు వచ్చాక ఆ అలవాటు పోయింది. అయితే కొత్తగా వచ్చిన ఈ ఫోల్డింగ్‌ థర్మల్‌ బ్యాగ్‌ను చూస్తే తీసుకువెళ్లకుండా ఉండలేరు. ఇది నిత్యజీవితంలో చాలా ఉపయోగపడుతుంది.

Published : 06 Mar 2022 00:45 IST

సంతకో, సూపర్‌ మార్కెట్‌కో వెళ్లినప్పుడు చేతి సంచి తీసుకువెళ్లడం ఇంతకు ముందు చాలామందికి అలవాటుగా ఉండేది. పాలిథీన్‌ కవర్లు వచ్చాక ఆ అలవాటు పోయింది. అయితే కొత్తగా వచ్చిన ఈ ఫోల్డింగ్‌ థర్మల్‌ బ్యాగ్‌ను చూస్తే తీసుకువెళ్లకుండా ఉండలేరు. ఇది నిత్యజీవితంలో చాలా ఉపయోగపడుతుంది. దీనిలోని థర్మల్‌ లేయర్‌ వేడి పదార్థాలను వేడిగా/చల్లటి పదార్థాలను చల్లగా  ఉంచుతుంది. బ్యాగులోని లోపలి పొర బయటి ఉష్ణోగ్రతను లోనికి రానివ్వదు. దాంతో పదార్థాలు ఎలా పెడితే అలానే ఉంటాయి. వాడిన తర్వాత మడిచి భద్రపరచొచ్చు. అంటే దీన్ని పెట్టడానికి పెద్దగా స్థలం కూడా అవసరం లేదన్నమాట. సరకులు, ఆహార పదార్థాలు, కూరగాయలు, పండ్లు... శీతల పానీయాలు.. ఇలా వేటినైనా ఇందులో పెట్టొచ్చు. కేవలం మార్కెట్‌కే కాకుండా, కుటుంబంతో కలిసి పిక్నిక్‌కు వెళ్లినప్పుడు వాడుకోవచ్చు. ఆకర్షణీయమైన రంగుల్లో, విభిన్న డిజైన్లతో ఆన్‌లైన్‌లో సందడి చేస్తున్నాయి. మీరు తెచ్చేసుకోండి మరి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని