చిటికెలో సిద్ధం

కూర, చారు, వెజ్‌, నాన్‌వెజ్‌.... ఇలా అన్నింట్లో వేసే వాటిలో వెల్లుల్లి కూడా ఒకటి. రోజూ ఏదో ఒక వంటకంలో దీన్ని వాడుతూనే ఉంటాం. అయితే దీన్ని తరగడం, చిన్న ముక్కలుగా చేసుకోవడం కాస్త కష్టమే.

Published : 13 Mar 2022 00:52 IST

కూర, చారు, వెజ్‌, నాన్‌వెజ్‌.... ఇలా అన్నింట్లో వేసే వాటిలో వెల్లుల్లి కూడా ఒకటి. రోజూ ఏదో ఒక వంటకంలో దీన్ని వాడుతూనే ఉంటాం. అయితే దీన్ని తరగడం, చిన్న ముక్కలుగా చేసుకోవడం కాస్త కష్టమే. ఫొటోలో కనిపిస్తున్న ‘టు ఇన్‌ వన్‌ గార్లిక్‌ ప్రెస్‌’ను రెండు రకాలుగా వాడుకోవచ్చు. కేవలం వెల్లుల్లి తరుగే కాకుండా సన్నటి స్లైస్‌లుగానూ చేసుకోవచ్చు. స్టాప్‌లర్‌లా ఉన్న దీని వాడకం చాలా సులువు.. పై భాగాన్ని తీస్తే కింది భాగంలో రెండు రంధ్రాలుంటాయి. ఒకటి సన్నటి తరుగునిస్తే... మరొకటి స్లైస్‌లుగా చేస్తుంది. వీటిలో వెల్లుల్లి రెబ్బలను పెట్టి గట్టిగా నొక్కితే చాలు తరుగు సిద్ధమవుతుంది. అల్యూమినియం, సిలికాన్‌లతో తయారైన ఈ పరికరం ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంది. శుభ్రం చేయడం కూడా సులువే.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని