ఈ ఆకుల్లో ఇనుము ఎక్కువ

మెంతి చపాతీ, టమాటా మెంతీ, మెంతీ రైస్‌... ఇలా మెంతి ఆకులతో బోలెడు రకాల వంటకాలు చేసుకుంటాం. ఇవి రుచికి కాస్త వగరుగా ఉన్నా ఆరోగ్యపరంగా చాలా మేలు చేస్తాయి.

Published : 20 Mar 2022 00:23 IST

మెంతి చపాతీ, టమాటా మెంతీ, మెంతీ రైస్‌... ఇలా మెంతి ఆకులతో బోలెడు రకాల వంటకాలు చేసుకుంటాం. ఇవి రుచికి కాస్త వగరుగా ఉన్నా ఆరోగ్యపరంగా చాలా మేలు చేస్తాయి.

* మెంతి ఆకులు రెండు  రకాలుగా లభిస్తాయి. చిన్న మెంతి, పెద్ద మెంతి అని పిలుస్తారు. లేతవి చక్కటి వాసనలను వెదజల్లుతూ ఉంటాయి. కాస్త ముదిరిన ఆకులనూ వంటల్లో వాడతారు.

* మెంతి కూరలో ఇనుము పుష్కలంగా ఉంటుంది. దీన్ని తరచూ ఆహారంలో చేర్చుకోవడం వల్ల రక్తహీనత సమస్య బారిన పడకుండా ఉండొచ్చు.

* ఈ ఆకుల్లో విటమిన్‌ సి, ఎ లతోపాటు బీటా కెరొటిన్‌ సమృద్ధిగా ఉంటుంది. విటమిన్‌-సి రోగనిరోధకతను పెంచుతుంది. అలాగే విటమిన్‌- ఎ దృష్టి సమస్యలను దూరం చేస్తుంది. ఈ ఆకుల్లోని యాంటీఆక్సిడెంట్‌ సమ్మేళనాలు చర్మాన్ని మెరిసేలా, మరింత యవ్వనంగా మారుస్తాయి.

* క్రమంతప్పకుండా దీన్ని తీసుకోవడం వల్ల మహిళల్లో నెలసరి సమయంలో వచ్చే నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

* ఈ ఆకుల నుంచి లభించే కెలొరీలు చాలా తక్కువ. పీచు మాత్రం పుష్కలంగా ఉంటుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారికి చక్కటి ఎంపిక. మలబద్ధకం సమస్యను తగ్గిస్తాయి.  జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి.

* కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె జబ్బులకు చెక్‌ పెడతాయి.

* పాలిచ్చే తల్లులకు చక్కటి పోషకాహారం. పాల ఉత్పత్తికి దోహదపడతాయి. మెనోపాజ్‌ వల్ల కలిగే సమస్యలను తగ్గిస్తాయి.

* వీటిని సమృద్ధిగా తీసుకుంటే జుట్టు బాగా పెరుగుతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని