రాగి, బాదం మిల్క్‌షేక్‌..

కావాల్సినవి: రాగులు- కప్పు (సుమారు 100 గ్రా., నుంచి 150 గ్రా.,); బాదం- 15, బెల్లం- రెండు చెంచాలు, యాలకుల పొడి- పావు చెంచా, నీళ్లు- కప్పు, బాదం తరుగు- చెంచా (అలంకరణకు).

Published : 20 Mar 2022 00:23 IST

కావాల్సినవి: రాగులు- కప్పు (సుమారు 100 గ్రా., నుంచి 150 గ్రా.,); బాదం- 15, బెల్లం- రెండు చెంచాలు, యాలకుల పొడి- పావు చెంచా, నీళ్లు- కప్పు, బాదం తరుగు- చెంచా (అలంకరణకు).

తయారీ: రాగులను శుభ్రం చేసి, మూడు, నాలుగుసార్లు నీళ్లతో కడగాలి. ఆ తర్వాత రాగులు మునిగేవరకు నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టుకోవాలి. బాదం గింజలనూ నానబెట్టుకోవాలి. ఉదయం బాదం పొట్టు తీసి కాసిన్ని నీళ్లు పోసి మిక్సీలో వేసి పేస్టు చేసుకోవాలి. అలాగే రాగులను మిక్సీజార్‌లో వేసి తగినన్ని నీళ్లు పోసి, పేస్ట్‌లా చేేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని తెల్లని, పలుచని శుభ్రమైన వస్త్రంలో వేసి రాగిపాలు తీసుకోవాలి.

పొయ్యిమీద గిన్నె పెట్టి, కొన్ని నీళ్లు పోసి, బెల్లం వేసి కరిగిన తర్వాత పొయ్యి కట్టేయాలి. ఇందులోనే రాగిపాలు, బాదంపేస్ట్‌, యాలకుల పొడి వేసి బాగా కలపాలి. బాదం తరుగుతో అలంకరించి సర్వ్‌ చేసుకోవాలి. ఇది అప్పటికప్పుడు చేసుకుని వాడుకోవాలి. వేసవిలో శరీరానికి చల్లదనంతోపాటు బలాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తుంది. తీపి ఎక్కువ కావాలనుకునేవారు కాస్తంత బెల్లం ఎక్కువగా వేసుకోవచ్చు. చల్లగా తాగాలనుకునేవారు కాసేపు ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని