వేరు చేసేస్తుంది

సూప్‌లు, గ్రేవీలు, సాస్‌లు... లాంటివి చేసినప్పుడు వాటిలో మిర్చీ, ఉల్లిపాయలు, టొమాటో ముక్కలు... ఇలా కొన్ని పంటి కింద అడ్డు తగులుతుంటాయి. అలాగే వీటి తయారీలో ఉపయోగించిన అధిక

Published : 20 Mar 2022 00:23 IST

సూప్‌లు, గ్రేవీలు, సాస్‌లు... లాంటివి చేసినప్పుడు వాటిలో మిర్చీ, ఉల్లిపాయలు, టొమాటో ముక్కలు... ఇలా కొన్ని పంటి కింద అడ్డు తగులుతుంటాయి. అలాగే వీటి తయారీలో ఉపయోగించిన అధిక నూనె/కొవ్వును తొలగించాలంటే... ఫ్యాట్‌ సెపరేటర్‌ను తెచ్చుకోవాల్సిందే.

గ్రేవీ/సూప్‌లను చిల్లుల మూత- మెష్‌ లిడ్‌ పై పోయాలి. దాంతో ద్రవం కాసేపటికి కిందకు దిగుతుంది. చిన్న చిన్న ముక్కలు, ఆహార రేణువులు పైన జాలీలో ఉండిపోతాయి. గ్రేవీలోని నూనె పైభాగంలో ఓ పొరలా పేరుకుపోతుంది. గ్రేవీ కిందకు చేరుతుంది. మూత దగ్గరున్న ఎర్రటి మీటను గట్టిగా నొక్కడం వల్ల అడుగున ఉన్న గ్రేవీ కింది రంధ్రం ద్వారా వెలుపలకు వచ్చేస్తుంది. చివరగా కొవ్వు లేయర్‌ వచ్చేసరికి దాన్ని ఆపేస్తే సరిపోతుంది. ఈ విధంగా గ్రేవీలు, సూప్‌లు, పండ్ల రసాలు, బ్రోత్‌లను చేసుకోవచ్చు.  పట్టుకోవడానికి అనువుగా ఉండే హ్యాండిల్‌ దీని ప్రత్యేకత. శుభ్రం చేయడమూ చాలా సులువు. దీన్ని కానుకగానూ ఇవ్వొచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని