పైనాపిల్‌ ము(క)ళ్లను తేలికగా తీసేస్తుంది!

యాపిల్‌ను కోసుకునో... నేరుగానో సులువుగా తినేస్తాం. అయితే పైనాపిల్‌ తినాలంటే మాత్రం దానికి ఉండే చిన్న ముళ్ల  (కళ్ల)లాంటి భాగాలు ఆ పండంటే అయిష్టత ఏర్పడేలా చేస్తాయి. అయితే చిత్రంలో

Updated : 27 Mar 2022 06:10 IST

యాపిల్‌ను కోసుకునో... నేరుగానో సులువుగా తినేస్తాం. అయితే పైనాపిల్‌ తినాలంటే మాత్రం దానికి ఉండే చిన్న ముళ్ల  (కళ్ల)లాంటి భాగాలు ఆ పండంటే అయిష్టత ఏర్పడేలా చేస్తాయి. అయితే చిత్రంలో కనిపిస్తోన్న ఈ చిన్ని స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ పైనాపిల్‌ ఐ రిమూవర్‌ టూల్‌/ఐ పీలర్‌.... మీ దగ్గరుంటే చాలు. పండుకు పైనుండే ముళ్ల లాంటి భాగాలను తీసేయొచ్చు. దీని చివర ఉండే సూది మొనలాంటి భాగాలు పండులోని ముళ్లను సులువుగా లోపలి నుంచి తీసేస్తాయి. ఉపయోగించడం, శుభ్రం చేయడమూ సులభమే. ఈ పరికరంతో టమాటా, స్ట్రాబెర్రీల తొడిమెలనూ తీసేయొచ్చు. బాగుంది కదూ.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని