కర కరగా.. కారం కారంగా..

చికెన్‌ కీమా- 300 గ్రా., ఉల్లిపాయ- ఒకటి (సన్న ముక్కలుగా), పచ్చిమిర్చి- రెండు (సన్న ముక్కలుగా), గుడ్డు- ఒకటి, కొత్తిమీర తరుగు- రెండు పెద్ద చెంచాలు, అల్లం వెల్లుల్లి ముద్ద, పుదీనా తరుగు, నిమ్మరసం- పెద్ద చెంచా చొప్పున;

Updated : 03 Apr 2022 06:56 IST

కావాల్సినవి: చికెన్‌ కీమా- 300 గ్రా., ఉల్లిపాయ- ఒకటి (సన్న ముక్కలుగా), పచ్చిమిర్చి- రెండు (సన్న ముక్కలుగా), గుడ్డు- ఒకటి, కొత్తిమీర తరుగు- రెండు పెద్ద చెంచాలు, అల్లం వెల్లుల్లి ముద్ద, పుదీనా తరుగు, నిమ్మరసం- పెద్ద చెంచా చొప్పున; మిరియాల పొడి, ధనియాల పొడి, గరంమసాలా- అర చెంచా చొప్పున; ఉప్పు- తగినంత, నూనె- వేయించడానికి సరిపడా, బ్రెడ్‌ పొడి- కప్పు.

తయారీ: శుభ్రం చేసిన చికెన్‌ కీమాను గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. మరో గిన్నెలో ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు, గరంమసాలా, అల్లం వెల్లుల్లి ముద్ద, కొత్తిమీర, పుదీనా తరుగు, మిరియాల పొడి, పసుపు, ధనియాల పొడి, ఉప్పు, నిమ్మరసం వేసి పదార్థాలన్నీ బాగా కలపాలి. ఇందులోనే చికెన్‌ కీమా వేసి మరోసారి కలపాలి. ఈ మిశ్రమాన్ని 15 నిమిషాలు ఫ్రిజ్‌లో పెట్టాలి. నానబెట్టిన మిశ్రమంలో గుడ్డును కూడా వేసి కలపాలి. ఇప్పుడు చికెన్‌ మిశ్రమాన్ని చిన్న చిన్న బుల్లెట్స్‌/బంతులు... ఇలా నచ్చిన  ఆకారంలో చేసుకుని, బ్రెడ్‌ పొడి అద్ది కాగిన నూనెలో వేసి మధ్యస్థ మంటపై బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. ఇలా అన్నింటినీ వేయించుకోవాలి. అంతే రుచికరమైన చికెన్‌ బుల్లెట్స్‌ రెడీ.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని