జ్ఞాపకశక్తికి కుంకుమ పువ్వు!

ఈ పువ్వు రేకలు ఆరోగ్యాన్నిస్తాయి. అందానికి మెరుగులు దిద్దుతాయి. ఒకట్రెండు తీసుకున్నా బోలెడు ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తాయి. అత్యంత ఖరీదైన ఈ పూరేకల వల్ల కలిగే లాభాలూ ఎక్కువే.

Published : 10 Apr 2022 01:12 IST

ఈ పువ్వు రేకలు ఆరోగ్యాన్నిస్తాయి. అందానికి మెరుగులు దిద్దుతాయి. ఒకట్రెండు తీసుకున్నా బోలెడు ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తాయి. అత్యంత ఖరీదైన ఈ పూరేకల వల్ల కలిగే లాభాలూ ఎక్కువే.
* కుంకుమ పువ్వు... కుంకుమ రంగులో ఉండటం వల్ల దీనికా పేరొచ్చింది. ఇది చాలా ఖరీదైంది. మనదేశంలో కశ్మీర్‌ ప్రాంతంలో పండుతుంది. దీంట్లో ఔషధ గుణాలు చాలా ఎక్కువ.  
* సాధారణంగా కుంకుమ పువ్వు మొక్క చాలా చిన్నగా ఉంటుంది. పూలకుండే కేసరాల నుంచే ఈ కుంకుమ పూ రేకలను సేకరిస్తారు.  
* ఈ పువ్వులోని సువాసనలు ఒత్తిడి, ఆందోళనలను తగ్గించి హాయిగా నిద్ర పట్టేలా చేస్తాయి. దీని రుచి ప్రత్యేకంగా ఉంటుంది. అంతే కాదు దీన్ని తరచూ తీసుకోవడం వల్ల మెదడు ప్రశాంతంగా ఉంటుంది.
* కంటి చూపును కాపాడుతుంది. చర్మ    ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంది... పంటి నొప్పిని దూరం చేస్తుంది.
* సువాసనలతోపాటు శరీరానికి శక్తినీ ఇస్తుంది.
* నెలసరి సక్రమంగా రానివారు రెండు కుంకుమ పూ రేకలను గోరువెచ్చని పాలలో వేసుకుని తాగితే ఫలితం ఉంటుంది. ఈ పువ్వును తరచూ తీసుకుంటే రక్తస్రావం చక్కగా అవుతుంది.  
* మన దేశంలో ఎక్కువగా దీన్ని వంటకాల్లో వాడతారు. ఆహారంగా, ఆరోగ్యపరంగానే కాదు సౌందర్య ఉత్పత్తుల తయారీలోనూ దీన్ని వాడకం అధికమే.
* జలుబుతో బాధపడేవారు గోరువెచ్చని పాలలో చిటికెడు వేసి తాగితే కాస్త ఉపశమనంగా ఉంటుంది. అలాగే రోజు పాలతో తీసుకుంటే జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుందట.
* గర్భాశయంలో కదలికలను సులభతరం చేయడానికి ఈ పువ్వు సాయం చేస్తుంది.
* కుంకుమ పువ్వు నిత్యం ఆహారంలో చేర్చుకుంటే గ్యాస్‌, కడుపులో మంట, అజీర్తి, మలబద్ధకం... లాంటి సమస్యలు తగ్గిపోతాయి.
* ఇది చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించి గుండె సమస్యలకు చెక్‌ పెడుతుంది.
* కొన్ని రకాల రుతు సమస్యలకు ఔషధంలా పనిచేస్తుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని