కరీనా పిజా.. దీపికా దోశ!

సినీ తారలకు అభిమానులు ఉండటం మూమూలే. అయితే ఆ అభిమానం మరీ పెరిగి వారి పేర్లను వంటకాలకు పెట్టేయడం విచిత్రంగా లేదు.  కరీనా కపూర్‌ సైజ్‌ జీరో పిజా, దీపికా పదుకొణె దోశ... ఇలా ఆహారపదార్థాల పేరు కొత్తగా, వింతగా ఉన్నా భోజన ప్రియులకు నచ్చేస్తున్నాయంట.

Published : 10 Apr 2022 01:15 IST

సినీ తారలకు అభిమానులు ఉండటం మూమూలే. అయితే ఆ అభిమానం మరీ పెరిగి వారి పేర్లను వంటకాలకు పెట్టేయడం విచిత్రంగా లేదు.  కరీనా కపూర్‌ సైజ్‌ జీరో పిజా, దీపికా పదుకొణె దోశ... ఇలా ఆహారపదార్థాల పేరు కొత్తగా, వింతగా ఉన్నా భోజన ప్రియులకు నచ్చేస్తున్నాయంట.

కరీనా కపూర్‌ సైజ్‌-జీరో పిజా.. ‘టషన్‌’ హిందీ చిత్రం ద్వారా బాలీవుడ్‌ నటి కరీనా కపూర్‌ ‘సైజ్‌ జీరో’ లుక్‌తో ప్రేక్షకుల మనసు దోచేసింది. ఆ నటికి ఆహార పదార్థాల్లో పిజా అంటే చాలా ఇష్టమట. దిల్లీలోని ఓ రెస్టారెంట్‌ ఈ రెండు విషయాలను జోడిస్తూ...  ‘కరీనా కపూర్‌ సైజ్‌-జీరో పిజా’ పేరిట పిజాను తయారుచేస్తోంది. సన్నని పొర లాంటి ఈ పిజా మీద బేబీకార్న్‌, పెద్ద చికెన్‌ ముక్కలు, ఉల్లిపాయలు, పండు మిర్చీ, లో ఫ్యాట్‌ చీజ్‌ను వాడతారట.


దీపికా పదుకొణె దోశ.. బాలీవుడ్‌ నటి దీపికాకు మసాలా దోశ అంటే చాలా ఇష్టమట. అలా ఆమెకిష్టమైన దోశకు  టెక్సాస్‌లోని ఓ చిన్న కెఫె తన మెనూలో దీపికా పదుకొణె దోశ అంటూ పేరు పెట్టింది. ఓ అభిమాని అక్కడి మెనూను ట్విటర్‌లో పంచుకోగా... ‘నేనూ తింటా’ అంటూ... ఈ స్క్రీన్‌ షాట్‌ను దీపిక భర్త రణ్‌వీర్‌ ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశారు.


సోనమ్‌ స్పెషల్‌ కేకు.. ఈ బాలీవుడ్‌ నటి పేరిట ఓ  ప్రత్యేకమైన కేకు కూడా ఉంది. ముంబయికి చెందిన దివ్య రాగ్లానీ అనే మిఠాయి వ్యాపారి.... సోనమ్‌ కపూర్‌ 25వ పుట్టిన రోజున ఈ ప్రత్యేక కేకును తయారు చేయడమే కాకుండా దీనికి ‘సోనమ్‌ స్పెషల్‌’ అంటూ పేరు పెట్టారు. ఓట్స్‌, పండ్లతో చేసిన ఈ మ్యాంగో బ్లూబెర్రీ కేకులో ఎలాంటి ప్రిజర్వేటివ్‌లు, అదనపు చక్కెరలు కలపలేదట..


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని