చిట్టి ఐస్‌ క్రషర్‌!

ఐస్‌ గోలా... మనలో చాలామందికి చిన్నప్పటి జ్ఞాపకం. ఎండాకాలం వస్తే చాలు బండి మీద అమ్మే గోలాను పోటీపడి మరీ కొనుక్కునేవాళ్లం. గట్టి ఐసు గడ్డను సన్నగా తరిగి గుండ్రంగా చేసి పుల్లకు పెట్టి రంగునీళ్లు పోసి ఇచ్చేవారు. ఐస్‌ను ముక్కలు చేయడం కోసం అప్పట్లో చాకు లాంటి పదునైన వస్తువును వాడేవారు.

Published : 10 Apr 2022 01:31 IST

ఐస్‌ గోలా... మనలో చాలామందికి చిన్నప్పటి జ్ఞాపకం. ఎండాకాలం వస్తే చాలు బండి మీద అమ్మే గోలాను పోటీపడి మరీ కొనుక్కునేవాళ్లం. గట్టి ఐసు గడ్డను సన్నగా తరిగి గుండ్రంగా చేసి పుల్లకు పెట్టి రంగునీళ్లు పోసి ఇచ్చేవారు. ఐస్‌ను ముక్కలు చేయడం కోసం అప్పట్లో చాకు లాంటి పదునైన వస్తువును వాడేవారు. అయితే ప్రస్తుతం ఐసును బరకగా చేయడానికి మార్కెట్‌లో చాలా రకాల మెషిన్‌లు వచ్చాయి. ఈ ఫొటోలో కనిపిస్తున్నది అలాంటిదే. పాస్టిక్‌తో తయారైన ఈ ఐస్‌ గోలా మేకర్‌/ఐస్‌ క్రషర్‌ భిన్న రంగుల్లో దొరుకుతుంది. దీంట్లో స్లష్‌ మేకర్‌తోపాటు మూడు చిన్న గిన్నెలు, ఆరు రీ యూజబుల్‌ స్టిక్స్‌ వస్తాయి. తేలికగా ఉండే దీన్ని ఎక్కడికైనా తీసుకువెళ్లొచ్చు. ఈ ఐస్‌ క్రషర్‌లోని పదునైన స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ బ్లేడ్లు ఐసును సన్నగా తరిగేస్తాయి. దీనికి పైన ఉండే గిన్నెలో ఐస్‌ ముక్కను వేసి మూత పెట్టి హ్యాండిల్‌ తిప్పితే చాలు ఐస్‌ తురుము వచ్చేస్తుంది. దీంతో ఎంచక్కా ఐస్‌ గోలాలు చేసుకోవచ్చు. ఐస్‌ తరుగును ఐస్‌క్రీమ్‌లు, జ్యూస్‌లు, ఇతర డ్రింక్స్‌లోనూ కలపొచ్చు. ఫుడ్‌ గ్రేడ్‌ ప్లాస్టిక్‌తో తయారైన ఇది విరగదు కూడా. దీన్ని వాడటం, శుభ్రం చేయడం చాలా సులువు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని