కిస్‌మిస్‌..కొత్తగా!

ఖీర్‌, పాయసం, పరమాన్నం... తియ్యటి వంటకాల్లో బాదం, కాజూలతోపాటు కలిసిపోతుంది కిస్‌మిస్‌. ఇది నలుపు, ఎరుపు, ఆకుపచ్చ... ఇలా భిన్న రంగుల్లోను లభ్యమవుతుంది.  వీటి గురించి మరిన్ని విశేషాలు...

Published : 01 May 2022 02:14 IST

ఖీర్‌, పాయసం, పరమాన్నం... తియ్యటి వంటకాల్లో బాదం, కాజూలతోపాటు కలిసిపోతుంది కిస్‌మిస్‌. ఇది నలుపు, ఎరుపు, ఆకుపచ్చ... ఇలా భిన్న రంగుల్లోను లభ్యమవుతుంది.  వీటి గురించి మరిన్ని విశేషాలు...
మృదువుగా, రసంతో, తియ్యతియ్యగా ఉండే కిస్‌మిస్‌ అంటే అందరికీ ఇష్టమే. ఇదొక ఎండు ద్రాక్ష. దీంట్లో ఆవశ్యక పోషకాలు మెండుగా ఉంటాయి. ఇవి శరీర ఆరోగ్యానికి మేలు చేస్తాయి.వీటిలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. పీచు కూడా సమృద్ధిగా ఉంటుంది. దీంట్లోని ఇనుము వల్ల వీటిని క్రమం తప్పకుండా ఆహారంలో తీసుకుంటే రక్తహీనత సమస్య ఎదురుపడదు. ఎముకలను దృఢంగా ఉంచుతాయి.

 


నలుపు...

తియ్యటి ఈ నలుపు రెసిన్లను విరివిగా వాడుతుంటారు. నల్లద్రాక్ష నుంచి వీటిని తయారు చేస్తారు. ఎండిన తర్వాత మరింత నలుపుదనాన్ని సంతరించుకుంటాయి.


సుల్తానా...

లేత పసుపు రంగులో చిన్న సైజులో ఉంటాయి. వీటిని సుల్తానా/గోల్డెన్‌ రెసిన్స్‌ అంటారు.  ఇవి టర్కిష్‌ గ్రీన్‌ గ్రేప్స్‌ నుంచి తయారవుతాయి.


ఆకుపచ్చ...

ఇవి చాలా పలుచగా, లేతాకుపచ్చ రంగులో  ఉంటాయి. తియ్యటి రుచితోపాటు ఎక్కువ రసం, పీచును కలిగి ఉంటాయి. వీటిని మధ్య ఆసియాలో ఎక్కువగా తయారు చేస్తారు.


ఎరుపు...పోషకాలమ్‌


చాలా రుచిగా ఉంటాయి. ‘ఫ్లేమ్‌ రెసిన్‌’ అని కూడా పిలిచే వీటిని ఎరుపు రంగు ద్రాక్ష నుంచి తయారు చేస్తారు. పెద్ద సైజులో మందంగా, ముదురుగా ఉంటాయి.  అలాగే దంత ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. కంటి చూపును మెరుగుపరుస్తాయి.


సాధారణ...


ఎండిన ద్రాక్షలనే రెసిన్లు/కిస్‌మిస్‌లని పిలుస్తాం.  ఇవి మహిళలకు మరింత మేలు చేస్తాయి.

ఝంటే కరెంట్స్‌.. దీని పేరు కొత్తగా ఉంది కదూ. ఇది నలుపు రెసిన్లలో ఒక రకం. అంత తియ్యగా ఉండదు. ముదురు రంగులో, చిన్న సైజులో విత్తనాలతో ఉంటుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని