ఒక జార్‌...రెండు మూతలు!

కూరలో చిటికెడు పసుపు సరిపోతుంది. మిరప గింజలు మరీ ఎక్కువగా అవసరం పడవు. ఇలా ఒక్కోదాన్ని.. కూర రకాన్ని బట్టి ఒక్కోలా.. వాడతాం. అయితే ప్రతిసారీ మూత తీసి వేయాలంటే ఇబ్బందా లేదా వేస్తున్న ప్రతిసారీ చిల్లుల నుంచి ఎక్కువగా పడిపోతుందా.. ఈ రెండు ఇబ్బందులకు ఈ ఒక్క జార్‌ చెక్‌ పెడుతుంది.

Updated : 01 May 2022 06:03 IST

కూరలో చిటికెడు పసుపు సరిపోతుంది. మిరప గింజలు మరీ ఎక్కువగా అవసరం పడవు. ఇలా ఒక్కోదాన్ని.. కూర రకాన్ని బట్టి ఒక్కోలా.. వాడతాం. అయితే ప్రతిసారీ మూత తీసి వేయాలంటే ఇబ్బందా లేదా వేస్తున్న ప్రతిసారీ చిల్లుల నుంచి ఎక్కువగా పడిపోతుందా.. ఈ రెండు ఇబ్బందులకు ఈ ఒక్క జార్‌ చెక్‌ పెడుతుంది. ‘ఆర్లిడ్‌ జార్‌’గా పిలిచే దీనికి రెండు మూతలంటాయి. పొడులను కావాలంటే చల్లుకోవచ్చు లేదా చేత్తో తీసి వేయొచ్చు. మీట పైవైపు నొక్కితే పైమూత, కింది వైపు నొక్కితే రెండో మూత తెరుచుకుంటాయి. వీటిలోని రంధ్రాల ఆధారంగా కావాల్సింది సెట్‌ చేసుకోవచ్చు కూడా. ఎయిర్‌ టైట్‌ జార్‌లుగా వస్తాయివి. వీటిలో నీళ్లు పోసి మూతపెట్టి అటూ ఇటూ తిప్పినా నీళ్లు బయటకు రావు. అందులోని పదార్థాలను తాజాగా ఉంచుతాయి. బటన్‌తో మనకు కావాల్సిన మూతను తెరవొచ్చు. పసుపు, ఉప్పు, కారం, అంటూ లేబుల్స్‌ అతికించుకోవచ్చు. ఒకదానిపై మరొకటి పెడుతూ తక్కువ స్థలంలోనూ చక్కగా సర్దేయొచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని