ఎండ నుంచి రక్షించే పచ్చి ఉల్లి!

చాట్‌ అయినా... చద్దన్నమయినా.. పచ్చి ఉల్లిపాయ రుచి పక్కన చేరితే భలేగా ఉంటుంది. ఈ వేసవిలో ఉల్లిపాయని పచ్చిగా తినడం వల్ల అనేక ప్రయోజనాలని పొందొచ్చంటున్నారు పోషకాహార నిపుణులు..

Updated : 15 May 2022 04:27 IST

చాట్‌ అయినా... చద్దన్నమయినా.. పచ్చి ఉల్లిపాయ రుచి పక్కన చేరితే భలేగా ఉంటుంది. ఈ వేసవిలో ఉల్లిపాయని పచ్చిగా తినడం వల్ల అనేక ప్రయోజనాలని పొందొచ్చంటున్నారు పోషకాహార నిపుణులు..

ఉల్లిలోని క్విర్‌సిటిన్‌ అనే పోషకం... ఎండబారిన పడి చర్మం ఎర్రగా మారడం, దద్దుర్లు బారిన పడటం వంటి సమస్యల నుంచి కాపాడుతుంది. ఎండకారణంగా దెబ్బతిన్న కణజాలాన్ని పునరుద్ధరిస్తుంది. అయితే ఉల్లిని పచ్చిగా తిన్నప్పుడే దీని ప్రయోజనాలు ఎక్కువగా అందుతాయట. వేసవిలో వివిధ రకాల బ్యాక్టీరియాల కారణంగా ఆహార పదార్థాలు త్వరగా పాడవుతుంటాయి. అవి తిన్న మనం జబ్బుల బారిన పడటానికి ఆస్కారం ఎక్కువ. ఉల్లి మన జీర్ణవ్యవస్థను వివిధ బ్యాక్టీరియాల నుంచి కాపాడుతుంది. వ్యాధినిరోధక శక్తిని గణనీయంగా పెంచుతుంది. అందుకే వీలున్నప్పుడు పచ్చిఉల్లిపాయని లాగించేయండి. 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని