ఒక్క ఆలూ చిప్‌... లక్షన్నరే!

ఆలూ చిప్స్‌... ఇవంటే ప్రాణం పెట్టే వీరాభిమానులు ఎక్కువే. ఎంత ప్రాణం పెట్టే వాళ్లయినా చిప్స్‌ ప్యాకెట్‌కి లక్షల్లో అయితే చెల్లించే వాళ్లు ఉంటారా? ఉంటారేమో చూడాలి. ఎందుకంటే... ఇంగ్లండ్‌లోని

Published : 22 May 2022 00:46 IST

ఆలూ చిప్స్‌... ఇవంటే ప్రాణం పెట్టే వీరాభిమానులు ఎక్కువే. ఎంత ప్రాణం పెట్టే వాళ్లయినా చిప్స్‌ ప్యాకెట్‌కి లక్షల్లో అయితే చెల్లించే వాళ్లు ఉంటారా? ఉంటారేమో చూడాలి. ఎందుకంటే... ఇంగ్లండ్‌లోని బకింగ్‌హమ్‌కి చెందిన ఓ వ్యాపారి ఈబేలో ఓ చిప్స్‌ ప్యాకెట్‌ని అమ్మకానికి పెట్టాడు. దీని ధర రెండు వేల యూరోలు. అంటే మన సొమ్ముల్లో లక్షా అరవైవేల రూపాయలు. అప్పుడే ఆశ్చర్యపోకండి. ఇది ఒక ప్యాకెట్‌ ధర నిజమే కానీ... ఆ ప్యాకెట్‌లో ఉండేది ఒకే ఒక చిప్‌ మాత్రమే. ఎందుకు దీనికింత ధర అంటే.. ఆ చిప్‌ ప్రత్యేకమైన ఆకృతిలో మడతపడి ఉండటమే ఇందుకు కారణమట. గతంలో కూడా ఒక చికెన్‌ నగ్గెట్‌ని ఇలా ఈబెలో పెడితే రూ.75 లక్షలకు ఎవరో ఆహారప్రియుడు కొనుగోలు చేశాడట. కాబట్టి ఇదేం తొలి ప్రయత్నం కాదు. మరి ఈ చిప్‌ని ఎవరు కొంటారో చూడాల్సిందే.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని