నీటిపై తేలే మార్కెట్లు!

ఏదైనా కొనాలనుకుంటే మార్కెట్‌కి వెళతాం. కానీ మార్కెట్‌ని చూడ్డానికే వెళ్లాలనుకుంటామా? థాయిలాండ్‌లో నీటిలో తేలియాడే ఫ్లోటింగ్‌ మార్కెట్ల అందం చూడటానికి చాలామంది పర్యటకులు వస్తుంటారు.

Published : 29 May 2022 01:57 IST

ఏదైనా కొనాలనుకుంటే మార్కెట్‌కి వెళతాం. కానీ మార్కెట్‌ని చూడ్డానికే వెళ్లాలనుకుంటామా? థాయిలాండ్‌లో నీటిలో తేలియాడే ఫ్లోటింగ్‌ మార్కెట్ల అందం చూడటానికి చాలామంది పర్యటకులు వస్తుంటారు. వందల సంవత్సరాల నుంచీ థాయిలాండ్‌లో ప్రజలు ఇలా నీటిలో తేలియాడే బోట్లపైనే కావాల్సిన ఆహారాన్ని కొనుక్కొనేవారు. క్రమంగా అవే ఫ్లోటింగ్‌ మార్కెట్లుగా మారి... పర్యటకులని ఆకర్షించడం మొదలుపెట్టాయి. నదీపరివాహక ప్రాంతంలో పండిన తాజా అరటిపండ్లు, మొక్కజొన్నలతోపాటు... ఇతరత్రా వ్యవసాయ ఉత్పత్తులని రైతులు బోట్లపై తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతుంటారు. పొద్దునే మొదలైన సందడి మధ్యాహ్నం వరకూ ఉంటుంది. మనం కూడా కొనుక్కోవచ్చు. వేడివేడిగా బజ్జీలు కావాలన్నా ఈ బోట్లపైనే వేసిస్తారు.

 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని