Published : 29 May 2022 01:57 IST

23 క్యారెట్ల...బంగారు బిర్యానీ!

...అంటే బంగారం లాంటి బిర్యానీ అనుకొనేరు. కాదండీ... అచ్చంగా 23 క్యారెట్ల తినే బంగారంతో చేసిన బిర్యానీనే. వినడానికి ఆశ్చర్యంగా ఉందా? తినడానికి కూడా బాగుంటుందని అంటున్నారు విశాఖపట్నం వాసులు. తినే బంగారంతో చేసిన బిర్యానీ ఖరీదు రూ. పదిహేనువందలు. వైజాగ్‌లోని ఓ రెస్టరెంట్‌ రాజభోగం పేరుతో వెండిగిన్నెలో ఈ బంగారు బిర్యానీని ప్రత్యేకంగా అందిస్తోంది. దుబాయిలో ఓ హోటల్‌లో ఈ బిర్యానీని చూసిన తర్వాత మన దగ్గరా చేస్తే బాగుంటుందని ఆలోచించి ఇక్కడా చేయడం మొదలుపెట్టారు. మీరూ తినాలనుకుంటే ముందుగా ఆర్డర్‌ ఇవ్వాల్సి ఉంటుంది మరి.


Advertisement

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts