తేనె చెంచాలు.. స్ట్రాలు!

ఆఫీసులో గ్రీన్‌టీ తాగాలనిపిస్తే టీ బ్యాగులు సిద్ధంగానే ఉంటాయి. కాసిని వేడినీళ్లు పోస్తే టీ సిద్ధమే! కానీ రుచి కోసం తేనె కలుపుకోవాలంటే... తలనొప్పే. టీ బ్యాగులు పట్టుకెళ్లినంత తేలిక కాదు తేనె డబ్బాలని దాచిపెట్టడం. అందులో ముంచిన చెంచాలని ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి.

Updated : 05 Jun 2022 05:37 IST

ఆఫీసులో గ్రీన్‌టీ తాగాలనిపిస్తే టీ బ్యాగులు సిద్ధంగానే ఉంటాయి. కాసిని వేడినీళ్లు పోస్తే టీ సిద్ధమే! కానీ రుచి కోసం తేనె కలుపుకోవాలంటే... తలనొప్పే. టీ బ్యాగులు పట్టుకెళ్లినంత తేలిక కాదు తేనె డబ్బాలని దాచిపెట్టడం. అందులో ముంచిన చెంచాలని ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. ఈ చికాకులని తప్పించడానికే హనీ స్టిక్స్‌, హనీ చెంచాలు వచ్చాయి. వీటిని కూడా టీ బ్యాగుల మాదిరిగా తేలిగ్గా తీసుకెళ్లొచ్చు. చిన్నచిన్న ప్యాకెట్లలో తేనెని ప్యాక్‌ చేయడం వల్ల టీలోకి తేనె ఎక్కువ తక్కువ కాకుండా ఉంటుంది. పని తక్కువ. ప్రయోజనం ఎక్కువ.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని