విరూపాక్షి అరటిపండ్ల ప్రత్యేకత అదే!

చక్రకేళి, అమృతపాణి, కర్పూరం.. ఇలా వేర్వేరు రుచులుండే అరటిపండ్ల గురించి తెలుసు. రుచితోపాటు.. పరిమళం కూడా ప్రత్యేకంగా ఉండే అరటిపండు గురించి తెలుసా?

Published : 12 Jun 2022 01:42 IST

చక్రకేళి, అమృతపాణి, కర్పూరం.. ఇలా వేర్వేరు రుచులుండే అరటిపండ్ల గురించి తెలుసు. రుచితోపాటు.. పరిమళం కూడా ప్రత్యేకంగా ఉండే అరటిపండు గురించి తెలుసా?

విరూపాక్షి కొండ అరటిపండ్లు ఈ కోవకే చెందుతాయి. తమిళనాడు, కేరళ సరిహద్దుల్లోని పళని కొండల్లో పెరిగే ఈ అరటిపండ్లకి చక్కని సువాసన ఉంటుంది. ఎత్తైన పశ్చిమ కనుమల్లో పెరిగే ఈ అరటిపండ్లకి జీఐ గుర్తింపూ ఉంది. మామూలు అరటి పండ్లతో పోలిస్తే వీటిలో తేమ కూడా తక్కువ. దాంతో నిల్వ ఉండే ప్రసాదాల్లో,  పళని పంచామృతంలో ఈ అరటిపండునే ఉపయోగిస్తారు.
 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని