పానీపూరీ పళ్లాలు!

పానీపూరిని వేగంగా వడ్డించడం ఒక కళ అయితే... దానిని అంతే వేగంగా తినడం మరో కళ. ఇక ఇంట్లో వీటిని తినాలంటే..తినడం కన్నా పుదీనానీళ్లు, ఉల్లిపాయలు, కూర ఒక చోట చేర్చుకుని వాటిని అటూఇటూ పడిపోయే పూరీలో జాగ్రత్తగా కూరడం అంటే మన ఓపికకి

Published : 26 Jun 2022 00:38 IST

పానీపూరిని వేగంగా వడ్డించడం ఒక కళ అయితే... దానిని అంతే వేగంగా తినడం మరో కళ. ఇక ఇంట్లో వీటిని తినాలంటే..తినడం కన్నా పుదీనానీళ్లు, ఉల్లిపాయలు, కూర ఒక చోట చేర్చుకుని వాటిని అటూఇటూ పడిపోయే పూరీలో జాగ్రత్తగా కూరడం అంటే మన ఓపికకి పరీక్షే. పానీపూరీ లవర్స్‌ ఎంత బాధపడైనా వీటిని తినేస్తారనుకోండి! అయినా కాస్త సౌకర్యం కోసం అన్నట్టుగా వీటికోసం ప్రత్యేకమైన పానీపూరీ ప్లేట్లు మార్కెట్లో దొరుకుతున్నాయి. మద్యలో పానీ వేసుకోవడానికి వీలుగా పెద్ద గుంట... చుట్టూ పూరీలు కదలకుండా అమర్చుకోవడానికి వీలుగా గుంటలు ఉంటాయి. పానీని ప్రాణంగా ప్రేమించేవాళ్లు ఆఖరి బొట్టు వరకూ వినియోగించుకొనేలా ఈ ప్లేట్‌ని రూపొందించారు. మరింకెందుకు ఆలస్యం. ఇక ఈ ప్లేట్‌లో పానీపూరీలను ఓ పట్టు పట్టేయండి. 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని