పూల వంటకాలతో ఆదాయం వాళ్లకి!

మనదేశంలో ఒక్కో ప్రాంతం ఒక్కో వంటకానికి ప్రసిద్ధని తెలుసు కదా! మరైతే ఉత్తరాఖండ్‌ దేనికి ప్రసిద్ధో తెలుసా? తెల్లని మంచు పర్వతాలుండే ఆ ప్రాంతంలో..  ఎర్రని పూలతో నిండిన బురాన్‌ చెట్లు అంతటా విస్తరించి ఉంటాయి. ఆ పూలతో చేసిన షర్బత్‌కు విదేశాల్లో విపరీతమైన డిమాండ్‌ ఉంది.

Updated : 03 Jul 2022 05:48 IST

మనదేశంలో ఒక్కో ప్రాంతం ఒక్కో వంటకానికి ప్రసిద్ధని తెలుసు కదా! మరైతే ఉత్తరాఖండ్‌ దేనికి ప్రసిద్ధో తెలుసా? తెల్లని మంచు పర్వతాలుండే ఆ ప్రాంతంలో..  ఎర్రని పూలతో నిండిన బురాన్‌ చెట్లు అంతటా విస్తరించి ఉంటాయి. ఆ పూలతో చేసిన షర్బత్‌కు విదేశాల్లో విపరీతమైన డిమాండ్‌ ఉంది. ఈ పూలల్లో ఔషధ గుణాలుండటమే ఇందుకు కారణం. రక్తహీనతని తగ్గించడం, శ్వాసకోస సమస్యల నుంచి ఉపశమనం కలిగించడం, నొప్పి నివారిణిగా పనిచేయడం ఈ పూల ప్రత్యేకత. ఏడాదంతా చల్లగా ఉండే ఈ ప్రాంతంలో... వ్యాధినిరోధక శక్తిని పెంచుకోవడానికి ఈ పూలతో చేసిన పచ్చడిని ఇష్టంగా తింటారు స్థానికులు. ఈ పూలను సేకరించి వాటికి రేకలని వేరుచేసి విక్రయించడం ద్వారా ఆదాయం పొందుతున్నారు ఇక్కడి మహిళలు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని